IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ కన్నేసిన టాప్ ఇండియా ప్లేయర్స్ వీరే!

IPL 2022 Mega Auction: Sunrisers Hyderabad Probable Squad, SRH పూర్తి జట్టు అంచనా | Oneindia Telugu

హైదరాబాద్: ఈ వీకెండ్‌లో జరిగే ఐపీఎల్ 2022 మెగావేలానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ సమాయత్తమవుతోంది. మెగా ఆక్షన్‌లో అనుసరించాల్సి వ్యూహాలను సిద్దం చేసుకుంటుంది. ఏయే ఆటగాడికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలాంటి ఆటగాళ్లను టార్గెట్ చేయాలనే ప్రణాళికలను రచిస్తోంది. రిటెన్షన్ ప్రక్రియలో కేన్ విలియమ్సన్(రూ.14 కోట్లు), అబ్దుల్ సమద్(రూ.4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్(రూ.4 కోట్లు) ముగ్గురు ఆటగాళ్లనే తీసుకున్న సన్‌రైజర్స్ కేవలం రూ. 22 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఈ లెక్కన ఆరెంజ్ ఆర్మీ దగ్గర రూ. 68 కోట్లు ఉన్నాయి. అత్యధిక పర్స్ మనీ కలిగిన రెండో జట్టుగా సన్‌రైజర్స్ వేలంలో పాల్గొంటుంది.

ఈ భారీ పర్స్ మనీతో సన్‌రైజర్స్ మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. అయితే గత కొన్ని సీజన్లుగా విదేశీ ఆటగాళ్లపై ఆధారపడ్డ ఆరెంజ్ ఆర్మీ ఈసారి ఆ తప్పిదం చేయవద్దనుకుంటుంది. ఈ క్రమంలోనే ఖతర్నాక్ భారత ఆటగాళ్లపై కన్నేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ చేసిన భారత ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.

దేవదత్ పడిక్కల్ కోసం..

దేవదత్ పడిక్కల్ కోసం..

ఓ ఫారీన్ ఓపెనర్‌ను తీసుకోవాలనుకుంటున్న సన్‌రైజర్స్ అతనికి తోడుగా ఇండియన్ ఓపెనర్‌ను ఎంచుకోవాలనుకుంటుంది. ఇందు కోసం దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్‌లను ఆప్షన్స్‌గా పెట్టుకుంది. ఇషాన్ కిషన్‌కు భారీ పోటీ ఉన్న నేపథ్యంలో పడిక్కల్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. ఫారిన్ ఓపెనర్లలో జానీ బెయిర్ స్టో, జాసన్ రాయ్‌లను టార్గెట్ చేసిన హైదారబాద్.. వారికి జోడిగా పడిక్కల్ సరిగ్గా సరిపోతాడనుకుంటుంది.

గత రెండు సీజన్లలో ఆర్‌సీబీ తరఫున పడిక్కల్ ఆకట్టుకున్నాడు. అయితే అతను నిలకడగా రాణించే బ్యాట్స్‌మెన్. కానీ వేగంగా ఆడలేడు. విధ్వంసకర ఫారీన్ ఓపెనర్ దొరికితేనే పడిక్కల్‌‌ కోసం సన్‌రైజర్స్ ప్రయత్నించనుంది.

 మిడిలార్డర్‌లో రాయుడు..

మిడిలార్డర్‌లో రాయుడు..

ఇక మిడిలార్డర్‌లో సీనియర్ ప్లేయర్, తెలుగు తేజం అంబటి రాయుడిని తీసుకోవాలనుకుంటుంది. తద్వారా తెలుగు ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అపవాదును తుడుచుకోవాలనుకుంటుంది. పైగా రాయుడి అనుభవం జట్టుకు కలిసొస్తుందని భావిస్తోంది. అతని కోసం ఇతర ఫ్రాంచైజీలతో గట్టిగానే పోటీపడాలనుకుంటుంది.

అతనితో పాటు రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, సురేశ్ రైనా, షారుఖ్ ఖాన్‌లపై కూడా ఓ కన్నేసింది. వీరిలో ఏ ఆటగాడు చిక్కినా సరేననే యోచనలో సన్‌రైజర్స్ ఉంది. జానీ బెయిర్ స్టో చిక్కకుంటే.. తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌ను వికెట్ కీపర్ కమ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా తీసుకోవాలనుకుంటుంది. అతనికి బ్యాకప్‌గా కనీస ధరతో సాహాను తీసుకునే అవకాశం కూడా ఉంది.

స్పిన్నర్‌గా చాహల్..

స్పిన్నర్‌గా చాహల్..

అఫ్గాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్ సేవలను కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ స్లాట్‌ను భారత స్పిన్నర్లతోనే భర్తీ చేయాలని భావిస్తోంది. దీని కోసం భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకోవాలనుకుంటుంది. అతని కోసం ఎంత ధరనైనా చెల్లించేందుకు సిద్దంగా ఉంది. అతనికి బ్యాకప్‌గా రాహుల్ చాహర్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుంధర్, అశ్విన్, హర్‌ప్రీత్ బ్రార్, షెబాజ్ అహ్మద్‌లను పెట్టుకుంది. కుల్దీప్ యాదవ్‌కు పెద్దగా పోటీ లేని నేపథ్యంలో అతను సులువుగా చిక్కే చాన్సుంది.

దీపక్ చాహర్ కోసం..

దీపక్ చాహర్ కోసం..

భువనేశ్వర్ కుమార్‌ను దూరం చేసుకున్న సన్‌రైజర్స్ అతని స్థానాన్ని అదే శైలి కలిగిన దీపక్ చాహర్‌తో భర్తీ చేయాలనుకుంటుంది. దీపక్ కోసం భారీ ధరను చెల్లించేందుకు కూడా సిద్దంగా ఉంది. అయితే జట్టులో ఇప్పటికే భారత అనామక పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఉన్న నేపథ్యంలో ఒక ఫారిన్ పేసర్‌ తీసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. మిగతా స్లాట్స్‌ను భారత ఆటగాళ్లతో భర్తీ చేయనుంది. దీపక్ చాహర్‌కు బ్యాకప్‌గా మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, శివమ్ మావి, ప్రసిధ్ కృష్ణ‌ల కోసం సన్‌రైజర్స్ ట్రై చేయనుంది. హర్షల్ పటేల్ ఆరెంజ్ ఆర్మీకి చిక్కే అవకాశం ఉంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, February 9, 2022, 12:26 [IST]
Other articles published on Feb 9, 2022

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X