తగ్గేదేలే అంటూ పుష్ప పోస్టర్..
గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో తగ్గేదేలే అంటూ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఆల్‌టైమ్ హిట్ మూవీ పుష్ప పోస్టర్‌ను సన్‌రైజర్స్ అడ్మిన్ మామ వాడేసాడు. బన్నీ ప్లేస్‌లో కేన్ మామను పెట్టి మ్యాచ్ తగ్గేదేలే అని చెప్పాడు. మ్యాచ్ విషయాన్ని కూడా పుష్ప టైటిల్ మాదిరి ఎడిట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌ను చూసి చిర్రెత్తుకుపోయిన సన్‌రైజర్స్ అభిమానులు మాత్రం అడ్మిన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఈ ఏతులు వద్దు తర్వాత కానీ ముందు మ్యాచ్ గెలవాలని కామెంట్ చేస్తున్నారు.
గెలిచిన తర్వాత..
మ్యాచ్ గెలిచిన తర్వాత ఇలాంటి ఎడింటింగ్ ట్వీట్స్ పెట్టమని సూచిస్తున్నారు. మరికొందరేమో రాయలేని పదాలతో బండబూతులు తిడుతున్నారు. తెలుగు హీరోల పేర్లు చెప్పుకుంటూ బతకడమే వీరి పనంటూ అసహ్యించుకుంటున్నారు. అక్కడ గుజరాత్ రెండింతలు బలంగా ఉందని, పైగా ఆ జట్టు ఓటమెరుగకుండా దూసుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. గత మ్యాచ్‌ల ఏదో గాలివాటంలా గెలిచామని ఈ మ్యాచ్ గెలిచి తమ సత్తా ఏంటో కేన్ సేన నిరూపించుకోవాలని చురకలంటిస్తున్నారు.
బ్రహ్మానందం మీమ్స్‌తో..
మరికొందరు మాత్రం తెలుగు కమెడియన్ బ్రహ్మానందం మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. మ్యాచ్ గెలవకుంటే అడ్మిన్ మామకు ఉంటుంది? అని హెచ్చరిస్తున్నారు. వద్దు బ్రో ఇలాంటి ట్వీట్స్‌తో మమ్మల్ని విసగించకు వంటి ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. మ్యాచ్ అయితే గెలవకపోని పిసికి సంపుతా బిడ్డా? అని అడ్మిన్‌ను భయపెడుతున్నారు. ఒక్క మ్యాచ్ గెలిచినందుకు సన్‌రైజర్స్ అడ్మిన్ మామ ఆగడం లేదంటూ ఫైర్ అవుతున్నారు.
అప్పుడు RRR రేంజ్‌లో ఎడిట్..
లక్నోతో మ్యాచ్‌కు ముందు RRR మూవీ టైటిల్స్ రూపంలో ఎడిట్ చేసి సన్‌రైజర్స్ అడ్మిన్ ట్విట్ చేశాడు. సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లా.. భువనేశ్వర్ కుమార్, ఎయిడెన్ మార్క్‌రమ్ ఫొటోలు పెట్టాడు. భువీ, మార్క్‌రమ్ ఇద్దరు కలిసి ఈ మ్యాచ్ గెలిపిస్తారనే ఉద్దేశంతో సన్‌రైజర్స్ అడ్మిన్ ఈ పోస్ట్‌ను రూపొందించాడు. అప్పుడు కూడా అడ్మిన్‌ను అభిమానులు చివాట్లు పెట్టారు.


Click it and Unblock the Notifications
