Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డు!

Sunrisers Hyderabad Scores The Lowest Score
IPL 2022: SunRisers Hyderabad Worst Record With Lowest Score In Powerplay | Oneindia Telugu

పుణే: ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే చెత్త ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్‌లో తేలిపోయిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత పేలవ బ్యాటింగ్‌తో చెత్త రికార్డు మూటగట్టుకుంది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో వంటి స్టార్ ఓపెనర్లను వదులుకున్న సన్‌రైజర్స్ ఆస్థాయి ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయకపోవడంతో కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగారు.

పేలవ బ్యాటింగ్... చెత్త రికార్డు...

పేలవ బ్యాటింగ్... చెత్త రికార్డు...

ఇక గ్రీన్ వికెట్‌పై రాజస్థాన్ రాయల్స్ పేసర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. అంపైర్ తప్పిదానికి కేన్ విలియమ్సన్(2) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. ఆ వెంటనే రాహుల్ త్రిపాఠి డకౌటయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నికోలస్ పూరన్(0) సైతం పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. దాంతో సన్‌రైజర్స్ పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి కేవలం 14 పరుగులు మాత్రమే చేసింది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే పవర్‌ప్లేలో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా సన్‌రైజర్స్ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇందులో బ్యాటర్ కొట్టిన ఒక్క బౌండరీ లేకపోవడం గమనార్హం. బై రూపంలోనే నాలుగు పరుగులు వచ్చాయి.

13 ఏళ్ల రికార్డు బ్రేక్..

13 ఏళ్ల రికార్డు బ్రేక్..

లోయస్ పవర్‌ప్లే స్కోర్స్ జాబితాలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ సన్‌రైజర్స్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. 2009లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్.. 2 వికెట్లకు 14 పరుగులే చేసింది. 2011లో చెన్నై సూపర్ కింగ్స్.. కేకేఆర్‌తో పవర్ ప్లేలో 2 వికెట్లకు 15 పరుగులే చేసింది. డేవిడ్ వార్నర్‌ను కాదని రూ.6.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన అభిషేక్ శర్మ(9) సైతం జట్టును ఆదుకోలేకపోయాడు. అబ్దుల్ సమద్(4) కూడా విఫలమవడంతో 37 పరుగులకే సన్‌రైజర్స్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఎయిడెన్ మార్క్‌రమ్(31 బ్యాటింగ్), రొమారియో షెఫెర్డ్(24 బ్యాటింగ్) పరువు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

సంజూ విధ్వంసం..

సంజూ విధ్వంసం..

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. సంజూ శాంసన్(27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. ఈ ఇద్దరితో పాటు జోస్ బట్లర్(35), షిమ్రాన్ హెట్‌మైర్(13 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32) విలువైన పరుగులు చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా.. భువీ, రోమియో తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Tuesday, March 29, 2022, 23:29 [IST]
Other articles published on Mar 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+