For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: నిద్రపోతున్నరా? అసలు ఎవరినీ తీసుకుంటార్రా? సన్‌రైజర్స్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం

IPL 2022: Sunrisers Hyderabad Getting Brutally Trolled For Bidding on Manish Pandey
IPL Auction 2022: Suresh Raina Unsold, CSK వెన్నుపోటు | SRH ఏం పీకుతున్నార్రా ? | Oneindia Telugu

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ ఇప్పటి వరకు ఒక్క ఆటగాడిని కూడా కొనుగోలు చేయలేదు. చేతిలో రూ.68 కోట్ల పర్స్ మనీని పెట్టుకొని టాప్ ప్లేయర్లందరినీ వదిలేసింది. మార్కీ ప్లేయర్స్ లిస్ట్‌లో టాప్ 10 క్రికెటర్స్‌కు కనీసం బిడ్ చేయలేదు. ఇక బ్రేక్ అనంతరం ప్రారంభమైన బ్యాట్స్‌మన్ ఆక్షన్‌లో మనీష్ పాండే కోసం బిడ్ వేసింది. ఈ సీజన్ మెగావేలంలో సన్‌రైజర్స్ వేసిన తొలి బిడ్ ఇదే కావడం గమనార్హం.

మనీశ్ పాండే కోసం..

అతని కనీస ధర రూ. 2 కోట్లకు సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ బోర్డు ఎత్తగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రేసులోకి వచ్చింది. దాంతో మనీశ్ పాండే ధర అమాంత పెరగ్గా.. లక్నో సూపర్ జెయింట్స్ ఎంట్రీ ఇచ్చి రూ. 4.60 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అనుసరిస్తున్న తీరు అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. అసలు సన్‌రైజర్స్ ఏ ఆటగాళ్లను తీసుకోవాలనుకుంటుందని అభిమానులు ట్విటర్ వేదికగా మండిపడుతున్నారు. వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయకుండా నిద్ర పోతున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.

చెప్పుతో కొట్టాలంటూ..

స్టార్ ఆటగాళ్లంతా వెళ్లిపోయాక ఎవరినీ తీసుకుంటారని నిలదిస్తున్నారు. చెప్పుతో కొట్టాలంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అసలు బిడ్ వేయడానికి ఎవరున్నారని, ఆక్షనర్ తప్పా అంటూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. గత నాలుగు సీజన్లుగా రూ. 44 కోట్లు తీసుకొని మనీశ్ పాండే టీమ్‌కు చేసిన నష్టం అప్పుడే మరిచిపోయావా? అంటూ సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నిస్తున్నారు. రాయలేని పదాలతో బండ బూతులు కూడా తిడుతున్నారు. చాయ్, బిస్కట్లతో ఈ మెగా వేలాన్ని ముగిస్తారా? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

టీమ్ అమ్మెయవచ్చు కదా..

చేతకానప్పుడూ టీమ్ అమ్మవచ్చు కదా? అంటూ సన్‌రైజర్స్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు వేలానికి ప్లానింగ్ లేకుండా వచ్చారా? కొంచెం దూకుడుగా వ్యవహరించండంటూ మంచిగా కూడా చెబుతున్నారు. అసలు ఏ ఆటగాళ్లను తీసుకోవాలో సన్‌రైజర్స్‌కు అర్థం కావడం లేదా? అని మండిపడుతున్నారు. మళ్లీ అన్ క్యాప్‌డ్ ప్లేయర్లను తీసుకొని వచ్చే సీజన్‌లో కూడా చెత్త పెర్ఫామెన్స్ కనబరుస్తారా? అంటూ మండిపడుతున్నారు.

శిఖర్ ధావన్, ప్యాట్ కమిన్స్, కగిసో రబడాల కోసమైనా సన్‌రైజర్స్ ప్రయత్నించాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

అయ్యర్‌కే ఎక్కువ..

ఇక వేలంలో శిఖర్ ధావన్‌ను రూ. 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్, రవిచంద్రన్ అశ్విన్‌ను రూ. 5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, ప్యాట్ కమిన్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 7.25 కోట్లకు, కగిసో రబడాను పంజాబ్ కింగ్స్ రూ. 9.25 కోట్లకు, శ్రేయస్ అయ్యర్ రూ. 12.25 కోట్లకు కేకేఆర్, ట్రెంట్ బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 8 కోట్లకు, మహమ్మద్ షమీ రూ. 6.25 కోట్లు గుజరాత్ టైటాన్స్‌కు ఫాఫ్ డుప్లెసిస్‌ను రూ. 7 కోట్లకు, క్వింటన్ డికాక్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.6.75 కోట్లకు కొనుగోలు చేసింది.దేవదత్ పడిక్కల్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.25 కోట్లకు, జాసన్ రాయ్ రూ.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్, హెట్‌మైర్(రూ.8.25) రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.

Story first published: Saturday, February 12, 2022, 14:01 [IST]
Other articles published on Feb 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+