Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs SRH:అదేందో కావ్య పాప రాలేదు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచింది!

IPL 2022: SRH Won On CSK When Kavya Maran Didnt Come To Ground

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎట్టకేలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బోణీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)తో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ హాజరు కాలేదు. ప్రతీ మ్యాచ్‌కు హాజరై టీమ్‌ను ఎంకరేజ్ చేసే కావ్య మారన్.. ఈ మ్యాచ్‌కు రాలేదు. గ్యాలరీలో తన హవభావాలతో సన్‌రైజర్స్ అభిమానులను అలరించే ఈ బ్యూటీ ఓనర్.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఎక్కడా కనిపించలేదు. వరుస ఓటములతో తీవ్ర నిరాశకు గురైందో లేక వ్యక్తిగత కారణాలతో రాలేదో తెలియదు కానీ.. ఆమె గైర్హాజరీలో సన్‌రైజర్స్ గెలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

సన్‌రైజర్స్ అభిమానులకు కొత్త సందేహాన్ని రేకెత్తించింది. కావ్య పాప లేకుంటేనే ఆరెంజ్ ఆర్మీ విజయాలందుకుంటుందా? అనే అనమానం కలుగుతోంది. కావ్య పాపతోనే జట్టుకు కలిసి రావడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆమె వచ్చిన ప్రతీ మ్యాచ్ ఓటమి పాలవుతుందని, గత సీజన్‌లోనే చూశామని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇదే నిజమైతే కావ్య పాప మైదానంకు రావద్దని సూచిస్తున్నారు. కొందరు మాత్రం తాము కావ్య పాప నవ్వులు మిస్సయ్యామని కామెంట్ చేస్తున్నారు.

IPL 2022: SRH Won On CSK When Kavya Maran Didnt Come To Ground

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మోయిన్ అలీ(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ ‌లతో 48), అంబటి రాయుడు(27 బంతుల్లో 4 ఫోర్లతో 27), రవీంద్ర జడేజా(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23) రాణించగా.. ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా.. ఎయిడెన్ మార్క్‌రమ్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. రూ. 6.50 కోట్ల ప్లేయర్ అభిషేక్ శర్మ(50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75) సూపర్ బ్యాటింగ్‌తో 17.4 ఓవర్లలోనే 155 పరుగులు చేసి మరో 14 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మకు తోడుగా రాహుల్ త్రిపాఠి(15 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్‌లతో 39 నాటౌట్), కేన్ విలియమ్సన్(40 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 32) రాణించారు. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి, డ్వేన్ బ్రావో తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, April 9, 2022, 20:45 [IST]
Other articles published on Apr 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+