
సన్‌రైజర్స్‌కు కష్టమే..
ఎందుకంటే.. 20 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. 16 పాయింట్లతో రెండు,మూడు స్థానాల్లో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా దాదాపు తమ బెర్త్‌లు ఖాయం చేసుకున్నాయి. ఇక ఉన్న ఒక్క నాలుగో స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడుతున్నాయి. ఇందులో ఇప్పటికే 14 పాయింట్లతో పాటు మెరుగైన రన్‌రేట్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీకే ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలున్నాయి.

100 పరుగుల భారీ తేడాతో..
ముంబైతో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్ చేరుతుంది. అలా కాదని గుజరాత్‌పై ఆర్‌సీబీ విజయం సాధించి..ముంబై చేతిలో ఢిల్లీ ఓడితే కోహ్లీ టీమ్ టోర్నీలో ముందడుగు వేస్తోంది. ఇక ఈ రెండు జట్లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓటమిపాలైతే.. కేకేఆర్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా రేసులో నిలుస్తాయి. అప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే.. పంజాబ్ కింగ్స్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో మెరుగైన రన్ రేట్‌తో విజయం సాధించాలి. 100 పరుగుల భారీ తేడా లేదా 8 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించాలి. దాదాపు ఇది అసాధ్యం. అద్భుతం జరిగితే తప్పా సన్‌రైజర్స్ టోర్నీలో ముందడుగు వేయడం కష్టం.

ముంబైపై భారీ విజయం సాధిస్తే..
అయితే ముంబై ఇండియన్స్‌తో ఘన విజయం సాధిస్తే సన్‌రైజర్స్‌కు మెరుగైన అవకాశాలు ఉండేవి. కేన్ విలియమ్సన్ సైతం ఈ మ్యాచ్‌కు ముందు టాస్ సందర్భంగా రన్‌రేట్ మెరుగుపరుచుకోవడంపై దృష్టిసారించామని చెప్పాడు. దానికి తగ్గట్లుగా ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 193 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. అయితే ముంబైని తక్కువ స్కోర్‌కే పరిమితం చేయడంలో ఆరెంజ్ ఆర్మీ విఫలమైంది. చెత్త బౌలింగ్‌తో దాదాపు ఓటమి అంచుకు చేరి.. భువనేశ్వర్ పుణ్యామా గట్టెక్కింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 60 పరుగుల తేడాతో గెలిచి ఉంటే.. రన్‌రేట్ మెరుగయ్యేది. అప్పుడు చివరి మ్యాచ్‌లో మాములు విజయం అందుకున్న సరిపోయేది.
సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ ఫార్మూలా ఇదే
1. ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ, కోల్‌కతా తమ తదుపరి మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడాలి.
2. ఢిల్లీపై ముంబై 75 పరుగులతో గెలిస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే చివరి మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో గెలవాలి.
3. ముంబై X పరుగులతో గెలిస్తే సన్‌రైజర్స్ 150-X పరుగులతో గెలవాలి. ఇదే ఆరెంజ్ ఆర్మీ గెలుపు సూత్రం.


Click it and Unblock the Notifications
