For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ఆర్‌సీబీ చేతిలో ఘోర పరాజయం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే?

IPL 2022: SRH Playoff Chances After Losing To RCB

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. పేలవ బౌలింగ్, బ్యాటింగ్‌తో ఆ జట్టు వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 67 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ప్రస్తుతం 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ 5 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 6వ స్థానంలో ఉంది.

మిగిలిన మూడు గెలిచినా..

మిగిలిన మూడు గెలిచినా..

చివరి మూడు మ్యాచ్‌లు గెలిచినా నెట్ రన్‌రేట్‌తో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. తాజా మ్యాచ్‌లో భారీ తేడాతో ఓటమి పాలవ్వడంతో సన్‌రైజర్స్ రన్‌రేట్ నెగటీవ్‌గా మారింది. దాంతో చివరి మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ భారీ విజయాలను నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు వరుస ఓటములతో టోర్నీని ఆరంభించి, ఆ తర్వాత గొప్పగా పుంజుకుని వరుసగా ఐదు విజయాలు సాధించిన హైదరాబాద్‌..తిరిగి ఓటమి బాట పట్టాక కోలుకోలేకపోతోంది.

మూడు బెర్త్‌లు కన్‌ఫమ్...

మూడు బెర్త్‌లు కన్‌ఫమ్...

ఇప్పటికే 8 విజయాలతో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ బెర్త్‌ను 99 శాతం ఖాయం చేసుకోగా.. 14 పాయింట్స్‌తో రాజస్థాన్ చేరువలో ఉంది. ఈ మూడు జట్లకు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై భారీ విజయంతో ఆర్‌సీబీ సైతం టాప్-4లోకి దూసుకొచ్చింది. అయితే ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాలి. ఒక్కదాంట్లోనైనా మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధించాలి.

ఆ మూడు జట్లు ఓడితేనే..

ఆ మూడు జట్లు ఓడితేనే..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‌ల్లో ఐదేసి విజయాలతో 5, 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే నాలుగో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ మిగతా రెండు మ్యాచ్‌లకు రెండు లేదా ఒకటి ఘోరంగా ఓడాలి. సన్‌రైజర్స్ మిగతా మూడు మ్యాచ్‌లను భారీ తేడాతో పాటు మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధించాలి. హైదరాబాద్ తరువాతి మ్యాచ్‌ల్లో కోల్‌కతా, ముంబై, పంజాబ్ జట్లతో తలపడనుంది. కోల్‌కతా ముంబై ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. పంజాబ్ కింగ్స్‌ను ఓడిస్తే ఆ జట్టు కూడా నిష్క్రమిస్తోంది. మే11న రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తోంది. అప్పుడు మెరుగైన రన్‌రేట్ సాధిస్తే హైదరాబాద్‌కు అవకాశం ఉంటుంది.

సన్‌రైజర్స్ చిత్తు..

సన్‌రైజర్స్ చిత్తు..

ముందుగా బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(0) గోల్డెన్ డకౌటైనా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(50 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73 నాటౌట్), రజత్ పటిదార్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) రాణించారు. చివర్లో గ్లేన్ మ్యాక్స్‌వెల్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), దినేశ్ కార్తీక్(8 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జగదీష సుచిత్ రెండు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 19.2 ఓవర్లలో 125 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి(37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఎయిడెన్ మార్కరమ్(21), నికోలస్ పూరన్(19) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సన్‌రైజర్స్‌లో నలుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. వానిందు హసరంగా కెరీర్ బెస్ట్ (5/18) ప్రదర్శనతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. జోష్ హజెల్ వుడ్ 2 వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Monday, May 9, 2022, 7:48 [IST]
Other articles published on May 9, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+