IPL 2022: మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’కు చిందేసిన సన్‌రైజర్స్ స్టార్ (వీడియో)

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ కోసం సమయాత్తం అవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. తమపై ఆగ్రహంగా ఉన్న అభిమానులను ఆకట్టుకునే పనిలో పడింది. మెగా వేలం అభిమానుల అంచనాలను అందుకోలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆరెంజ్ ఆర్మీ.. వారిని బుజ్జగించే కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే తెలుగు భాషకు ప్రాధానత్య ఇస్తూ ట్వీట్లన్నీ తెలుగులోనే చేస్తున్న సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ తాజాగా మరో అడుగు ముందుకేసింది.
అభిమానులను సంతోషపరచడమే తమ లక్ష్యమని, టైటిల్ గెలిచి వారి ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తామని చెబుతున్న సన్‌రైజర్స్ స్టార్స్.. ఆట కంటే ముందు ఆఫ్ ద ఫీల్డ్‌లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
డేవిడ్ వార్నర్ బాటలోనే..
మాజీ కెప్టెన్, ఫ్రాంచైజీకే వన్నె తెచ్చిన డేవిడ్ వార్నర్ బాటలోనే నడుస్తున్నారు. ఆటతో పాటు ఎలాంటి పనులతో అయితే వార్నర్ తెలుగు ప్రజల మనసులను గెలుచుకున్నాడో ఆ పద్దతినే అనుసరిస్తున్నారు. తెలుగు ప్రజలను భాష సెంటిమెంట్‌తో తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా, క్రికెట్‌ను ఒక్కదగ్గరికి చేర్చుతూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న నాచురల్ స్టార్ నాని అప్‌కమింగ్ 'సుందరం' మూవీ గురించి ట్వీట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
సర్కారు వారి పాటకు..
టీమ్ యువ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మతో మహేశ్ బాబు అప్‌కమింగ్ 'సర్కారు వారి పాట'మూవీలోని పాపులర్ సాంగ్‌కు చిందేయించింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన కళావతి సాంగ్ స్టెప్స్‌ను అభిషేక్ శర్మ అనుకరించాడు. సినిమా ప్రమోషన్స్ కోసం మూవీ యూనిట్ ఈ సాంగ్‌లోని స్టెప్స్‌ను వాడుకుంటున్న విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ థమన్‌తో పాటు హీరో మహేశ్ బాబు, అతని కూతురు సితారా, అభిమానులు ఎంతో మంది ఈ పాట స్టెప్స్‌ను అనుకరించారు. తాజాగా ఆ ప్రమోషన్ క్యాంపైన్‌లోకి సన్‌రైజర్స్ ఎంట్రీ ఇచ్చింది.
ఖుషి ఖుషిగా మహేశ్ ఫ్యాన్స్..
అభిషేక్ శర్మ చేసిన వీడియోకు 'సర్కారు వారి పాటకు అభిషేక్ వారి ఆట'అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ వీడియోపై చిత్ర యూనిట్ కూడా స్పందించింది. 'మీ ఆట.. మా పాట రెండు అదిరిపోతాయి.. ఐపీఎల్ 2022 సీజన్‌లో దుమ్మురేపండి'అంటూ విష్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. మహేశ్ బాబు ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. సూపర్ స్టార్ అభిమానులంతా సన్‌రైజర్స్‌కు సపోర్ట్ చేయాలని పిలుపిస్తున్నారు.
ఆల్‌ద బెస్ట్ చెప్పిన నాని..
వాషింగ్టన్ సుందర్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడనే విషయాన్ని సన్‌రైజర్స్ అడ్మిన్ తనదైన శైలిలో చెప్పాడు. టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని అప్‌కమింగ్ మూవీ సుందరం రిలీజ్ డేట్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. 'ఆ సుందరం జూన్‌లో వస్తాడు.. ఈ సుందరం ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు'అని వాషింగ్టన్ సుందర్ ప్రాక్టీస్ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ట్వీట్‌పై నాని కూడా స్పందించాడు. ఆల్‌ద బెస్ట్ సుందర్.. ఫ్రమ్ సుందర్ అంటూ కామెంట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications