For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: వరుసగా నాలుగు పరాజయాలు.. సన్‌రైజర్స్‌మేనేజ్‌మెంట్‌పై ఫ్యాన్స్ బండ బూతులు!

IPL 2022: SRH Management Gets Brutally Trolled By Fans After 4 Consecutive Losses

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. పేలవ బౌలింగ్, బ్యాటింగ్‌తో ఆ జట్టు వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 67 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ప్రస్తుతం 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ 5 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 6వ స్థానంలో ఉంది. చివరి మూడు మ్యాచ్‌లు గెలిచినా.. ప్లే ఆఫ్స్ చేరాలంటే నెట్ రన్‌రేట్‌తో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఫ్యాన్ ఫైర్..

తాజా మ్యాచ్‌లో భారీ తేడాతో ఓటమి పాలవ్వడంతో సన్‌రైజర్స్ రన్‌రేట్ నెగటీవ్‌గా మారింది. దాంతో చివరి మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ భారీ విజయాలను నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు వరుస ఓటములతో టోర్నీని ఆరంభించి, ఆ తర్వాత గొప్పగా పుంజుకుని వరుసగా ఐదు విజయాలు సాధించిన హైదరాబాద్‌.. తిరిగి ఓటమి బాట పట్టాక కోలుకోలేకపోతోంది. ఇక సన్‌రైజర్స్ వరుస ఓటములుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బండ బూతులతో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌పై విరుచుకుపడుతున్నారు.

రాయలేని పదాలతో..

వరుస ఓటముల నుంచి సన్‌రైజర్స్ గుణపాఠం నేర్చుకోవడం లేదని, తప్పిదాలను సవరించుకునే ప్రయత్నం చేయడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా టీమ్ కాంబినేషన్‌పై దృష్టిసారించాలని సూచిస్తున్నారు. అంతగా అనుభవం లేని బౌలింగ్ విభాగాన్ని పక్కనపెట్టాలని సూచిస్తున్నారు. ప్లే ఆఫ్స్ చేరుతారని ఎన్నో అంచనాలు పెట్టుకున్నామని, కానీ పేలవ ప్రదర్శనతో ఈ సారి కూడా తమ భావోద్వేగాలు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే రాయలేని బూతు పదాలతో విమర్శలు గుప్పిస్తున్నారు.

కేన్ మామపై వేటు వేయండి...

బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్‌పై వేటు వేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అతన్ని మిడిలార్డర్‌లోకి పంపించాలని, రాహుల్ త్రిపాఠిని ఓపెనర్‌గా ఆడించాలని సూచిస్తున్నారు. ఫరూఖీపై వేటు వేసి ఫిలిప్స్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా చివరి మూడు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ చేరాలని కోరుకుంటున్నారు. ఉమ్రాన్ మాలిక్‌ను కూడా తీసేయాలని, టీమ్ కాంబినేషన్‌కు సంబంధించిన కామెంట్లు చేస్తున్నారు.

ఘెర పరాజయం..

ముందుగా బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(0) గోల్డెన్ డకౌటైనా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(50 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73 నాటౌట్), రజత్ పటిదార్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) రాణించారు. చివర్లో గ్లేన్ మ్యాక్స్‌వెల్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), దినేశ్ కార్తీక్(8 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జగదీష సుచిత్ రెండు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Monday, May 9, 2022, 12:27 [IST]
Other articles published on May 9, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+