IPL 2022: అందరూ బౌలర్లే అయితే బ్యాటింగ్ ఎవడు చేయాలి? సన్‌రైజర్స్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!

బెంగళూరు: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఎవ్వడికీ అర్థం కావడం లేదు. తొలి రోజు వేలంలో 33 మంది ప్లేయర్లకు కనీసం బిడ్ కూడా వేయని సన్‌రైజర్స్ హైదరాబాద్.. అభిషేక్ శర్మ వంటి అనామక క్రికెటర్లపై కోట్లు కుమ్మరించింది. ప్రతిభకు లోటు లేకున్నా నిలకడలేమితో సతమతమయ్యే నికోలస్ పూరన్‌కు భారీ ధర వెచ్చించింది. ఇండియా స్టార్లను వదిలేసింది. తొలి రోజు వైఫల్యాన్ని అధిగమిస్తూ.. రెండో రోజైనా మెరుగైన ఆటగాళ్లను తీసుకుంటుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.
అంతా బౌలర్లే..
ఎయిడెన్ మార్క్‌రమ్ కొనుగోలుతో రెండో రోజు మెగా వేలాన్ని మొదలుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత మార్కో జాన్సెన్, రొమారియో షెఫెర్డ్‌లను తీసుకుంది. ఈ ముగ్గురిలో మార్క్‌రమ్ ఒక్కడే బ్యాట్స్‌మన్ కాగా.. మిగతా ఇద్దరూ బౌలర్లే. షెఫెర్డ్ బిగ్ హిట్టర్. అయితే ఇప్పటికే రిటైన్ చేసుకున్న ఉమ్రాన్ మాలిక్‌తో పాటు భువనేశ్వర్ కుమార్, నటరాజన్, కార్తీక్ త్యాగీ, మార్కో జాన్సెన్‌లను కొనుగోలు చేసిన ఆరెంజ్ ఆర్మీ.. పూర్తిగా బౌలర్లనే జట్టులోకి తీసుకుంది.
షెఫెర్డ్‌కు రూ.7.75 కోట్లు..
తక్కువ ధరకు లభించే అవకాశం ఉన్నా స్టార్ బ్యాట్స్‌మన్ డేవాన్ కాన్వే, ఎవిన్ లూయిస్‌లను వదిలేసింది. హిట్టరయిన రొమారియో షెఫెర్డ్ కోసం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీపడి మరీ రూ.7.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇంకా ఓపెనర్లు దొరకలేదు. మిడిలార్డర్‌లో అనుభవం లేమి కొట్టొస్తోంది. అయినా ఇంకా బౌలర్లను తీసుకోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్క్‌రమ్.. విలియమ్సన్ మినహా చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మన్ ఒక్కడు లేడు.
ఫన్నీ మీమ్స్..
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టు మొత్తం బౌలర్లతో నిండిపోతే బ్యాటింగ్ ఎవడు చేస్తాడు? అని ప్రశ్నిస్తున్నారు. విధ్వంసకర బ్యాటర్ ఒక్కడు లేడని, ఈ టీమ్‌తో మ్యాచ్‌లు గెలవడం కష్టమేనని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ గెలవాలంటే ఒక్క బౌలింగ్ ఉంటే సరిపోదని, బ్యాటింగ్ విభాగం కూడా ఉండాలని చురకలంటిస్తున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
15 మంది ప్లేయర్లే..
ఇప్పటి వరకు మొత్తం 12 మంది ప్లేయర్లను సన్‌రైజర్స్ తీసుకుంది. రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లను కలుపుకుంటే ఆరెంజ్ ఆర్మీ వద్ద ప్రస్తుతం 15 మంది ఆటగాళ్లు ఉంటారు. వేలంలో ఇప్పటివరకు సన్‌రైజర్స్ వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఐడెన్ మాక్రమ్, కార్తీక్ త్యాగి, నటరాజన్, మార్కో జాన్సెన్, నికోలస్ పూరన్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, సుచిత్, రొమారియో షెఫెర్డ్‌లను కొనుగోలు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications