For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Kavya Maran: కావ్య పాప‌తో సన్‌రైజర్స్‌కు కలిసిరావడం లేదు! నేటి మ్యాచ్‌కు రావద్దంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

IPL 2022: SRH Fans Request Kavya Maran Not To Attend Todays Match vs Gujarat Titans

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌కు ఆ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్‌తో కలిసి రావడం లేదా? ఆమెది ఐరన్ లెగ్గా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కావ్య పాప మ్యాచ్‌కు హాజరైనప్పుడల్లా టీమ్ ఓటమిపాలైందని ఆ జట్టు అభిమానులు ఆరోపిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌కు కావ్య పాప హాజరు కాలేదని, దాంతో అంచనాలు లేని అభిషేక్ శర్మ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టుకు విజయాన్నందించాడని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్‌తో నేడు(సోమవారం) జరిగే మ్యాచ్‌కు కావ్య పాప రావద్దని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు.

ప్రతీ మ్యాచ్‌కు హాజరై టీమ్‌ను ఎంకరేజ్ చేసే కావ్య మారన్.. చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌కు మాత్రం హాజరు కాలేదు. గ్యాలరీలో తన హవభావాలతో సన్‌రైజర్స్ అభిమానులను అలరించే ఈ బ్యూటీ ఓనర్.. గత మ్యాచ్‌లో ఎక్కడా కనిపించలేదు. వరుస ఓటములతో తీవ్ర నిరాశకు గురైందో లేక వ్యక్తిగత కారణాలతో రాలేదో? తెలియదు కానీ.. ఆమె గైర్హాజరీలో సన్‌రైజర్స్ గెలవడం హాట్ టాపిక్‌గా మారింది. వరుస మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్.. చెన్నైపై గెలవడం చూస్తుంటే.. లక్ ఫ్యాక్టరేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగాలంటే కావ్య పాప మ్యాచ్‌కు రావద్దంటున్నారు.

IPL 2022: SRH Fans Request Kavya Maran Not To Attend Todays Match vs Gujarat Titans

అయితే ఈ వాదనను ఆమె అభిమానులు ఖండిస్తున్నారు. గతంలో కావ్య హాజరైన మ్యాచ్‌లు కూడా సన్‌రైజర్స్ గెలిచిందని గుర్తు చేస్తున్నారు. అసలు కావ్య మారన్ కోసమే సన్‌రైజర్స్ మ్యాచ్‌లు చూడటంతో పాటు జట్టుకు మద్దతు ఇస్తున్నామని కొందరు కామెంట్ చేస్తున్నారు. అలాంటిది కావ్య రావద్దని అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాలరీలో ఆమె పెట్టే బుంగ మూతి, ఆమె చిందించే నవ్వులు తమకు కావాలని కామెంట్ చేస్తున్నారు. అద్బుతమైన ఆటతో ఆమెను సంతోషంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఇంకొందరైతే.. 'ఇదెక్కడి విడ్డూరం.. సన్‌రైజర్స్ గెలవాలంటే కావ్య పాప మ్యాచ్‌కు రావద్దంటా? 'అనే ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌పై తొలి విజయాన్నందుకున్న సన్‌రైజర్స్.. పాయింట్స్ టేబుల్లో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఇక నుంచి జైత్రయాత్ర కొనసాగించాలనుకుంటుంది.అయితే లీగ్ ఇప్పటి వరకు ఓటమే ఎరుగని నయా టీమ్ గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్‌కు గట్టి పోటీ తప్పేలా లేదు.పేపర్‌పై గుజరాత్ టైటాన్స్.. ఆరెంజ్ ఆర్మీకంటే బలంగా కనిపిస్తోంది. పైగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆ జట్టు చివరి రెండు బంతులకు సిక్స్‌లు బాది విజయాన్నందుకుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Story first published: Monday, April 11, 2022, 11:32 [IST]
Other articles published on Apr 11, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+