Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడే.. కేన్‌మామపైనే సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఆశలు!

 IPL 2022: SRH Fans Compares Kane Williamson With Mahesh Babu Song
IPL 2022: Kane Mama Is Back | Sunrisers Hyderabad Practice Session | Oneindia Telugu

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరినీ ఏకం చేసి సహచరుల్ని ప్రత్యర్థుల్లా.. ప్రత్యర్థుల్ని సహచరుల్లా మార్చే ఐపీఎల్ 2022 సీజన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖరీదైన ఖతర్నాక్ లీగ్ మరో 9 రోజుల్లో షురూ కానుంది. కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడంతో ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ కానుంది. ఇప్పటికే ఆయా జట్లన్నీ టైటిల్ లక్ష్యంగా కసరత్తులు మొదలుపెట్టాయి. తెలుగు టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం ప్రాక్టీస్ షురూ చేసింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడు రోజుల క్వారంటైన్ ముగించుకొని మైదానంలోకి దిగాడు.

ఫుట్‌బాల్ ఆడిన కేన్ మామ..

టీమ్ ఫిజియోతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడాడు. ఇతర ఆటగాళ్లతో వార్మప్ సెషన్‌లో పాల్గొన్నాడు. కేన్ మామకు సంబంధించిన ప్రాక్టీస్ వీడియోలను, ఫొటోలను సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇక ఈ ప్రాక్టీస్ సెషన్ వీడియోలతో ఆరంభ మ్యాచ్‌లకు కేన్ మామ దూరమని వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. మోచేతి గాయంతో బాధపడుతున్న కేన్ విలియమ్సన్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదని గత రెండు మూడు రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

గాయం వార్తలు ఫేక్..

గతేడాది భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ అనంతరం.. విలియమ్సన్‌ ఏ విధమైన క్రికెట్‌ ఆడలేదు. ఇటీవలే అతను జట్టుతో కలిసినా పూర్తి ఫిట్‌గా లేడని ప్రచారం జరిగింది. ఆరంభ మ్యాచ్‌లకు అతను దూరంగా ఉంటాడని, భువనేశ్వర్ కుమార్ జట్టును నడిపిస్తాడని ఊహాగానాలు వినిపించాయి. కానీ తాజా ప్రాక్టీస్ సెషన్‌లో కేన్ మామ జాలిగా ఆడుతూ కనిపించాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు అభిమానులు కేన్ విలియమ్సన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. మెగా వేలంలో ఏమాత్రం తమ అంచనాలను అందుకొని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌పై పీకల్‌దాకా కోపం మీదున్నారు.

వెలిగే కిరణం అతడే..

స్టార్ ఆటగాళ్లను వదిలేసి అనామక ఆటగాళ్లపై కోట్లు తగలేసారని, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజాన్ని వదులుకున్నారనే అసహనంలో ఉన్నారు. ఈ క్రమంలోనే విలియమ్సన్ గాయం వారిని కాస్త కలవరపాటుకు గురిచేసింది. అయితే తాజా ప్రాక్టీస్ వీడియోను చూసిన తర్వాత వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. 'చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడే'‌నని కేన్ మామపై ఆశలు పెంచుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు అతడు సినిమాలోని ఈ హిట్ సాంగ్‌ను పాడుతూ కేన్ మామను కొనియాడుతున్నారు. ప్రస్తుతం అభిమానుల కామెంట్లు వైరల్ అయ్యాయి.

Story first published: Thursday, March 17, 2022, 18:13 [IST]
Other articles published on Mar 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+