CSK vs SRH:అదరగొట్టిన అభిషేక్ శర్మ.. సన్‌రైజర్స్ బోణీ! పాపం చెన్నైకి నాలుగో ఓటమి!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా రెండు పరాజయాలతో అద్భుత విజయాన్నందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన హైదరాబాద్.. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది వరుసగా నాలుగో పరాజయం. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మోయిన్ అలీ(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 48), అంబటి రాయుడు(27 బంతుల్లో 4 ఫోర్లతో 27), రవీంద్ర జడేజా(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23) రాణించగా.. ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా.. ఎయిడెన్ మార్క్‌రమ్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.
అభిషేక్ సూపర్ బ్యాటింగ్
అనంతరం లక్ష్య చేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. రూ. 6.50 కోట్ల ప్లేయర్ అభిషేక్ శర్మ(50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75) సూపర్ బ్యాటింగ్‌తో 17.4 ఓవర్లలోనే 155 పరుగులు చేసి మరో 14 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మకు తోడుగా రాహుల్ త్రిపాఠి(15 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్‌లతో 39 నాటౌట్), కేన్ విలియమ్సన్(40 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 32) రాణించారు. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి, డ్వేన్ బ్రావో తలో వికెట్ తీసారు.
శుభారంభం..
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(3) మంచి శుభారంభాన్ని అందించారు. ఆరంభంలో నిదానంగా ఆడిన ఈ జోడీ మిస్టరీ స్పిన్నర్ మహీష్ తీక్షణ బౌలింగ్‌లో హిట్టింగ్ షురూ చేసింది. పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. ఆ తర్వాత వీలు చిక్కిన బంతులను బౌండరీలకు తరలించిన ఈ జోడీ.. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో స్కోర్ బోర్డును పరుగెత్తించింది. క్రిస్ జోర్డాన్ వేసిన 12వ ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసిన అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కేన్ మామ ఔటైనా..
అదే జోరులో అభిషేక్ భారీ సిక్సర్ బాదగా.. ముఖేశ్ చౌదరి వేసిన మరుసటి ఓవర్‌లో కేన్ విలియమ్సన్ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 89 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి.. సిక్సర్‌తో మొదలు పెట్టాడు. బ్రావో వేసిన 15వ ఓవర్‌లో అభిషేక్ శర్మ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను జడేజా అందుకోలేకపోయాడు. ఈ అవకాశంతో అతను మరింత చెలరేగాడు. అయితే అతని జోరుకు డ్వేన్ బ్రావో కళ్లేం వేసాడు. క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ రెండు బౌండరీలు బాది .. విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications