RRR రేంజ్‌లో ఎడిట్..
లక్నోతో మ్యాచ్ ఉందనే విషయాన్ని RRR మూవీ టైటిల్స్ రూపంలో ఎడిట్ చేసి సన్‌రైజర్స్ అడ్మిన్ ట్విట్ చేశాడు. సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లా.. భువనేశ్వర్ కుమార్, ఎయిడెన్ మార్క్‌రమ్ ఫొటోలు పెట్టాడు. భువీ, మార్క్‌రమ్ ఇద్దరు కలిసి ఈ మ్యాచ్ గెలిపిస్తారనే ఉద్దేశంతో సన్‌రైజర్స్ అడ్మిన్ ఈ పోస్ట్‌ను రూపొందించాడు.
గత మ్యాచ్‌లో మార్క్‌రమ్ హాఫ్ సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. మళ్లీ అతను అదే జోరు కనబరుస్తాడని టీమ్‌మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానులు ఆశిస్తున్నారు. భువీ సైతం తన బౌలింగ్‌తో పర్వాలేదనపించాడు. స్వింగ్‌కు అనుకూలిస్తున్న గ్రీన్ వికెట్స్‌పై అతను కీలకం అవుతాడని అంతా భావిస్తున్నారు.
గెలుస్తే చాలూ స్వామి..
అయితే ఈ ట్వీట్‌ను చూసి చిర్రెత్తుకుపోయిన సన్‌రైజర్స్ అభిమానులు మాత్రం అడ్మిన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. RRR రేంజ్ ఏతులు వద్దు కానీ.. గెలుస్తే చాలు స్వామి అని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 'నువ్వు చేసే ఎడిట్స్‌కు వాళ్లు ఆడే ఆటకు ఏమైనా సంబంధం ఉందారా?'అంటూ నిలదీస్తున్నారు.
కనీసం ఈ రోజైనా గెలవాలని, మా గుండెలను పగలగొట్టవద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అసలు జట్టులో క్వాలిటీ ప్లేయర్లు ఎవరు? ఉన్నారని మరో అభిమాని ప్రశ్నించాడు. ఎక్స్‌ఫ్యాక్టర్ ఆల్‌రౌండర్‌తో పాటు క్వాలిటీ స్పిన్నర్ లేడని మండిపడుతున్నారు. ఈ జట్టుతో గెలవడం కష్టమేనని కామెంట్ చేస్తున్నారు.
మహేశ్ బాబు ఎంట్రీలా హైప్..
సన్‌రైజర్స్ అడ్మిన్ ఇచ్చే బిల్డప్‌కు వారు ఆడే ఆటకు ఎలాంటి పొంతనలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ బాబు ఎంట్రీలా హైప్ ఇచ్చి.. సంపూర్ణేబాబు వచ్చినట్లు.. సన్‌రైజర్స్ తీరు ఉందని సెటైర్లు పేల్చుతున్నారు. నీకు ఇక్కడ ఉన్న క్రియేటివిటీ.. ఆక్షన్ టైమ్‌లో ఉంటే బాగుండేదంటున్నారు. ఈ రోజు అన్నా గెలవండి బ్రో లేకుంటే ఒక్కోక్కడికి పగిలిపోద్ది అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.
కేన్‌మామనే పక్కన పెట్టేస్తావ్‌రా?
ఇక RRR బిల్డప్ పోస్ట్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను పక్కనపెట్టడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేన్ విలియమ్సన్ కోసమే ఈ జట్టును ఇంకా అభిమానిస్తున్నామని, లేకుంటే ఎప్పుడో పక్కనపెట్టేసేవాళ్లమని మండిపడుతున్నారు. అసలు కేన్ లేకుండా పోస్ట్ ఎలా పెడతావ్? అంటూ మండిపడుతన్నారు. భువీ, మార్క్‌రమ్ బదులు కేన్, వార్నర్ ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. వార్నర్‌లా.. కేన్‌ను కూడా అవమనిస్తావా? మార్క్‌రమ్‌కు కెప్టెన్సీ ఇస్తావా? అని ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications
