For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: రాజస్థాన్ రాయల్స్‌కు గుడ్ న్యూస్.. ఆ హిట్టర్ తిరిగొచ్చాడు!

IPL 2022: Shimron Hetmyer likely to be available for RRs match against CSK

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో కీలక పోరు ముందు రాజస్థాన్ రాయల్స్ అభిమానులకు గుడ్ న్యూస్. పెటర్నిటీ లీవ్‌తో జట్టుకు దూరమైన విధ్వంసకర బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్‌మైర్ జట్టులో చేరాడు. మేం 20న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న రాజస్థాన్ చివరి లీగ్ మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండనున్నాడు. ప్రస్తుతం టీమ్ క్వారంటైన్‌లో ఉన్న హెట్‌మైర్ మూడు రోజుల అనంతరం జట్టుతో కలవనున్నాడు.

చెన్నైతో మ్యాచ్‌కు హెట్‌మైర్ అందుబాటులోకి రావడం రాజస్థాన్‌కు కొండంత బలాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్ గెలిచి టెన్షన్ లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 8 విజయాలతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. చెన్నైతో జరిగే చివరి మ్యాచ్‌ గెలిస్తే 18 పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకుంటుంది. ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే మెరుగైన రన్‌రేట్ ఉన్న నేపథ్యంలో ప్లే ఆఫ్స్ బెర్త్‌కు డోకా అయితే లేదు.

IPL 2022: Shimron Hetmyer likely to be available for RRs match against CSK

తన భార్య మగ బిడ్డకు జన్మనివ్వడంతో జట్టు బయో-బబుల్‌ను వీడి హెట్‌మైర్‌ స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది సీజన్‌లో హెట్‌మైర్‌ అద్భతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు హెట్‌మైర్‌ 11 మ్యాచ్‌లాడి 291 పరుగులు సాధించాడు. ఫినిషర్‌గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. స్లాగ్ ఓవర్లలో విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు కావాల్సిన పరుగులు చేస్తున్నాడు. ఈ సీజన్ మెగా వేలంలో హెట్‌మైర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.8.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Story first published: Monday, May 16, 2022, 18:35 [IST]
Other articles published on May 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+