IPL 2022 Schedule: టోర్నీ ఫార్మాట్‌లో మార్పు.. రెండు గ్రూప్‌లుగా లీగ్ మ్యాచ్‌లు!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. బ్రాడ్‌కాస్టర్స్ విజ్ఞప్తి మేరకు మార్చి 26 నుంచే లీగ్‌ను స్టార్ట్ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్(జీసీ)లో నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 జట్లు 74 మ్యాచ్‌లు ఆడే విధంగా షెడ్యూల్‌ను రూపొందించింది. ముంబై, పుణెలో జరిగే లీగ్ స్టేజ్‌కు స్టార్టింగ్ 40 శాతం మంది ఫ్యాన్స్‌ను స్టేడియంలోకి అనుమతించనున్నారు. ముంబైలోని వాంఖడే(20 మ్యాచ్‌లు), బ్రబౌర్న్(15), డీవై పాటిల్(20) స్టేడియాలతో పాటు పుణెలోని ఏంసీఏ స్టేడియం(15)ను వేదికలుగా ఎంపిక చేశారు.
10 జట్లు రెండు గ్రూప్‌లుగా..
అయితే వాంఖడేలో ఆడటం వల్ల ముంబై ఇండియన్స్‌కు ఫేవర్‌గా ఉంటుదన్న ఇతర ఫ్రాంచైజీల వాదనపై జీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలపై రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటించనుంది. వీటిని అహ్మదాబాద్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఇక 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది.
టైటిల్స్ గెలిచిన ఆధారంగా టీమ్స్ ర్యాంకింగ్స్ కేటాయించి గ్రూప్‌లుగా విభజించనున్నారు. ఇక ఒక్కో గ్రూప్‌లో ఐదేసీ టీమ్స్ ఉండనుండగా.. ఒక్కో టీమ్ తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. అంతేకాకుండా తమ స్థానంలోనే ఉన్న ఇతర గ్రూప్‌లోని టీమ్‌తో కూడా రెండు మ్యాచ్‌లు.. ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతాయి. కొంచెం ఈ ఫార్మాట్ గజిబిజిగా ఉన్నా.. మ్యాచ్‌లు జరిగే కొద్ది స్పష్టంగా అర్థం కానుంది.

టైటిల్స్ ఆధారంగా ర్యాంక్స్..
అత్యధిక టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్(5) టాప్ ర్యాంక్ అందుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్(4) రెండో స్థానం, కోల్‌కతా నైట్‌రైడర్స్(2) మూడో స్థానం.. సన్‌రైజర్స్ హైదరాబాద్(1)నాలుగు, రాజస్థాన్ రాయల్స్(1) ఐదో స్థానంలో నిలవనున్నాయి.
ఇక టైటిల్ గెలవని టీమ్స్‌లో ఎక్కువ సార్లు ఫైనల్, ప్లే ఆఫ్స్ చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరో స్థానం, ఢిల్లీ క్యాపిటల్స్ ఏడో స్థానం, పంజాబ్ కింగ్స్ 8వ స్థానంలో ఉండనున్నాయి. కొత్తగా వచ్చిన జట్లలో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ 9, 10 స్థానాల్లో నిలవనున్నాయి.

ర్యాంక్స్‌ను బట్టి గ్రూప్స్..
బేసి సంఖ్య ర్యాంక్ కలిగిన జట్లన్నీ( ముంబై ఇండియన్స్, కేకేఆర్, ఆర్ ఆర్, ఢిల్లీ, లక్నో) గ్రూప్-ఏలో ఉండనుండగా.. సరిసంఖ్య ర్యాంక్ కలిగిన (సీఎస్‌కే, సన్‌రైజర్స్, ఆర్‌సీబీ, పీబీకేఎస్, గుజరాత్ టైటాన్స్) గ్రూప్-బిలో ఉండనున్నాయి. టోర్నీ ఫార్మాట్ ప్రకారం టాప్ ర్యాంక్ కలిగిన ముంబై ఇండియన్స్.. గ్రూప్-ఏలో ఉన్న కేకేఆర్, ఆర్ ఆర్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. ఇక గ్రూప్ బిలో తమ పొజిషన్‌లోనే టాప్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో కూడా రెండు మ్యాచ్‌లు.. ఇతర జట్లు సన్‌రైజర్స్, ఆర్‌సీబీ, గుజరాత్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. మొత్తంగా ఒక్కో జట్టు 14 లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది.

ఒక్కో టీమ్‌తో రెండు మ్యాచ్‌లు..
గ్రూప్-బీలో ఆర్‌సీబీ లీగ్ మ్యాచ్‌లను పరిశీలిస్తే.. అదే గ్రూప్‌లో ఉన్న ఇతర జట్లు సీఎస్‌కే, సన్‌రైజర్స్, పీబీకేఎస్, గుజరాత్ టైటాన్స్‌తో నాలుగు మ్యాచ్‌లు.. గ్రూప్‌ఏలో తమ పొజిషన్‌లోనే ఉన్న రాజస్థాన్ రాయల్స్‌తో కూడా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. మిగతా టీమ్స్ ముంబై ఇండియన్స్, కేకేఆర్, ఢిల్లీ, లక్నోలతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచిన తొలి రెండు జట్లు, గ్రూప్ బిలో అగ్రస్థానంలో నిలిచిన తొలి రెండు జట్లు ప్లే ఆఫ్స్ ఆడనున్నాయి. లీగ్ దశలో ఒక్కో టీమ్ ఏడేసి మ్యాచ్‌లు ఇంట బయటా ఆడనున్నాయి. మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications