Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే అశ్విన్ రిటైర్డ్ ఔటయ్యాడు : సంజూ శాంసన్

IPL 2022: Sanju Samson Reveals Why Ravichandran Ashwin Gave Retired Out vs Lucknow Super Giants

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బ్యాటింగ్‌కు వచ్చి అద్భుత ప్రదర్శన కనబర్చిన అశ్విన్ అనూహ్యంగా రిటైర్డ్ ఔటయ్యాడు. రిటైర్డ్ ఔట్ అంటే బ్యాట్స్‌మన్
స్వయంగా ఔట్ ప్రకటించుకొని పెవిలియన్ చేరడం. ఐపీఎల్ చరిత్రలో ఇలా రిటైర్డ్ ఔటవ్వడం ఇదే తొలిసారి. అశ్విన్ చేసిన పనితో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే తాను రిటైర్‌ ఔట్‌ అయ్యే సమయానికి మంచి టచ్‌లో ఉన్నాడు. 23 బంతుల్లో 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసిన అతను... హెట్‌మైర్‌తో కలిసి 66 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసి అశ్విన్ ఈ అనుహ్య నిర్ణయాన్ని ప్రకటించాడు.

జట్టు నిర్ణయమే..

జట్టు నిర్ణయమే..

అయితే టీమ్ ప్రణాళికల్లో భాగంగానే అశ్విన్ రిటైర్డ్ ఔట్ అయ్యాడని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. రియాన్ పరాగ్‌కు బ్యాటింగ్ ఇచ్చేందుకు అలా చేశాడని చెప్పాడు. మ్యాచ్ అనంతరం హోస్ట్.. అశ్విన్ రిటైర్డ్ ఔట్‌పై ప్రశ్నించగా.. సీజన్‌కు ముందే ప్లాన్ చేశామని చెప్పాడు. 'సీజన్ ప్రారంభానికి ముందే కొత్తగా టరై చేయాలనుకున్నాం. రిటైర్డ్ ఔటైపై కూడా చర్చించాం. పరిస్థితులు డిమాండ్ చేస్తే రిటైర్డ్ ఔట్ అవ్వడానికి సిద్దపడాలనుకున్నాం. ఆ క్రమంలోనే అశ్విన్ రిటైర్డ్ ఔట్ తీసుకున్నాడు. ఇది పూర్తిగా టీమ్ నిర్ణయం.'అని సంజూ శాంసన్ స్పష్టం చేశాడు. ఇక విజయంపై స్పందిస్తూ.. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉండటం సంతోషంగా ఉందన్నాడు.

కుల్దీప్ సేన్ సూపర్..

కుల్దీప్ సేన్ సూపర్..

కుల్దీప్ సేన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. 'తొలి మూడు ఓవర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో కుల్దీప్‌పై నమ్మకం పెరిగింది. అతని ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. ఈ సీజన్‌కు ముందు అతను వైడ్ యార్కర్లపై వర్క్ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనే కుల్దీప్ సేన్ వైడ్ యార్కర్లు వేయం చూసి ఆశ్చర్యపోయాను. తొలి బంతి వేసే ముందు బౌల్ట్ నా దగ్గరకు వచ్చి ప్లాన్ చేశానని, వికెట్ తీయడమే లక్ష్యంగా రాహుల్ కాళ్లకు వేస్తానని చెప్పాడు.

చాహల్ గ్రేటేస్ట్ లెగ్ స్పిన్నర్..

చాహల్ గ్రేటేస్ట్ లెగ్ స్పిన్నర్..

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను చెప్పినట్లు చేసి వికెట్ తీసాడు. అతని నైపుణ్యం ఆకట్టుకుంది. ఇక హెట్‌మైర్‌తో సరిగ్గా తిన్నావా? పడుకున్నావా? సంతోషంగా ఉన్నావా? అనేదే మాట్లాడా. అతను తన సత్తా ఏంటో చూపించాడు. అతనికి ఎంతో అనుభవంతో పాటు పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో అనే సెన్స్ ఉంది. అతను తన బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించాడు. యుజ్వేంద్ర చాహల్ గ్రేటెస్ట్ లెగ్ స్పిన్నర్. 20 ఓవర్లలో ఎప్పుడూ బంతినిచ్చినా అతను ఫలితాన్ని ఇస్తాడు. చివర్లో అతనితో ఎందుకు బౌలింగ్ చేయించలేదా? అని అనిపిస్తోంది'అని సంజూ చెప్పుకొచ్చాడు.

చాహల్ చార్ వికెట్...

చాహల్ చార్ వికెట్...

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. షిమ్రన్ హెట్‌మైర్(36 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 4 ఫోర్లతో 29), రవిచంద్రన్ అశ్విన్(23 బంతుల్లో 2 సిక్స్‌లతో 28) రాణించారు. లక్నో బౌలర్లలో జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్ రెండేసి వికెట్లు తీసారు. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. మార్కస్ స్టోయినీస్, క్వింటన్ డికాక్(32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 39)టాప్ స్కోరర్లుగా నిలవగా.. దీపక్ హుడా(24 బంతుల్లో 3 ఫోర్లతో 25), కృనాల్ పాండ్యా(15 బంతుల్లో 2 ఫోర్లతో 22) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లతో సత్తా చాటగా.. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రసిధ్, కుల్దీప్ సేన్‌కు తలో వికెట్ దక్కింది.

Story first published: Monday, April 11, 2022, 10:54 [IST]
Other articles published on Apr 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+