For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ రోజు బ్యాట్ నేలకు కొట్టి బయటకు పరుగెత్తా.. క్రికెట్ వదిలేద్దామనుకున్నా: సంజూ శాంసన్

IPL 2022: Sanju Samson recalls frustrating moments of last five years of his career

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ సారథిగా సత్తా చాటుతున్న సంజూ శాంసన్.. తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా గత ఐదేళ్లలో కెరీర్ పరంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపాడు. ఆశించిన రితీలో కెరీర్ సాగకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన తాను ఒక రోజు బ్యాట్ నేలకు కొట్టి మైదానంకు దూరంగా పరుగెత్తానని చెప్పాడు. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్ బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్ యూట్యూబ్ షోలో పాల్గొన్న సంజూ అనేక విషయాలు పంచుకున్నాడు.

20 ఏళ్ల వయసులోనే అవకాశం..

20 ఏళ్ల వయసులోనే అవకాశం..

ఐపీఎల్ 2013 సీజన్‌లో క్యాష్ రిచ్ లీగ్‌లోకి అరంగేట్రం చేసిన సంజూ వరుసగా రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన కనబర్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. సూపర్ బ్యాటింగ్‌తో మరుసటి ఏడాది టీమిండియా పిలుపు కూడా అందుకున్నాడు. 2015లో జింబాబ్వే పర్యటన సందర్భంగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అలా సుమారు 20 ఏళ్ల వయస్సులో టీమిండియాకు సెలక్ట్‌ అయిన ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నిలకడలేమి ఆట కారణంగా జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత మరో ఐదేళ్లకు భారత్ తరఫున ఆడే అవకాశాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన కష్టాలను గుర్తు చేసుకున్నాడు.

కఠిన పరిస్థితులు..

కఠిన పరిస్థితులు..

'నా 20 ఏళ్ల వయసులో భారత జట్టులోకి అరంగేట్రం చేశాను. ఆ తర్వాత మళ్లీ 25 ఏళ్ల వయసులో టీమిండియాకు సెలక్ట్‌ అయ్యాను. నా జీవితంలో ఈ కాలం అత్యంత క్లిష్టమైనది. కేరళ జట్టు నుంచి కూడా నన్ను తప్పించారు. ఎన్నెన్నో సవాళ్లు. అలాంటి సమయంలో కచ్చితంగా మన మీద మనకు నమ్మకం పోతుంది. అయితే, నేను మాత్రం సంజూ నువ్వు మళ్లీ తిరిగి జట్టులోకి వస్తావ్.. అని మనసుకు సర్దిచెప్పుకునేవాడిని. జీవితంలో ఇలాంటి కఠిన దశలు ఎదురవుతూ ఉంటాయి. నిజాయితీ, నమ్మకంతో వాటిని అధిగమించగలం.

బ్యాట్ నేలకు కొట్టి..

బ్యాట్ నేలకు కొట్టి..

అప్పట్లో నేను త్వరగా ఔటయ్యేవాడిని.. కోపం, విసుగు, చిరాకు వచ్చేవి. ఒకరోజు ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లి డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లగానే బ్యాట్‌ నేలకు కొట్టాను. మ్యాచ్‌ జరుగుతుండగానే మైదానం వీడి బయటకు పరుగెత్తాను. అది బ్రబౌర్న్‌ స్టేడియం. ఆ రోజు నేను ఔటైన తీరు తీవ్రంగా నిరాశపరిచింది.

క్రికెట్‌ వదిలేసి.. ఇంటికి వెళ్లిపోదామనుకున్నా. బ్యాట్‌ అక్కడే పడేసి కేరళకు తిరుగు ప్రయాణం అవుదామనుకున్నా. కాసేపటి తర్వాత మెరైన్‌ డ్రైవ్‌కు వెళ్లి సముద్రాన్ని చూస్తూ నాలో నేనే ఆలోచించడం మొదలుపెట్టాను. రెండు గంటల పాటు అక్కడ కూర్చున్న తర్వాత రాత్రి తిరిగి వచ్చాను. అప్పటికి మ్యాచ్‌ అయిపోయింది. డ్రెస్సింగ్‌ రూమ్‌లో చూస్తే నా బ్యాట్‌ విరిగి పడి ఉంది. నా మీద నాకే కోపం వచ్చింది. బ్యాట్‌ను కాకుండా పిల్లోను విసిరిపడేయాల్సింది అని పశ్చాతాపానికి గురయ్యాను.'' అని సంజూ శాంసన్ గుర్తు చేసుకున్నాడు.

10 మ్యాచ్‌లు.. 298 రన్స్..

10 మ్యాచ్‌లు.. 298 రన్స్..

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్ 298 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 55. ఇక అతని సారథ్యంలోని రాజస్తాన్‌ రాయల్స్ 6 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్‌కు మూడు అడుగుల దూరంలో ఉంది. అయితే కెప్టెన్‌గా బ్యాటర్‌గా సత్తా చాటుతున్నా సంజూ శాంసన్‌కు టీమిండియాలో చోటు దక్కడం కష్టంగా మారింది. రిషభ్ పంత్ ప్రధాన వికెట్ కీపర్‌గా కొనసాగుతుండగా.. బ్యాకప్ కీపర్ ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్ పోటీ పడుతున్నారు.

Story first published: Tuesday, May 3, 2022, 17:40 [IST]
Other articles published on May 3, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+