విరాట్ కోహ్లీ వైఫల్యానికి అదే కారణం: ఆర్‌సీబీ బ్యాటింగ్ కోచ్

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మార్కో జాన్సన్ వేసిన స్వింగ్ డెలివరీకి స్లిప్ క్యాచ్‌గా ఔటయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో కూడా కోహ్లీ గోల్డెన్ డక్ అయ్యాడు. దాంతో 14 ఏళ్ల తన కెరీర్‌లో తొలి సారి బ్యాక్ టు బ్యాక్ గోల్డెన్ డక్ రికార్డును నమోదు చేశాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన విరాట్ .. 41,12, 5, 48, 1, 12, 0, 0 లతో 119 పరుగులు మాత్రమే చేశాడు. అయితే విరాట్ కోహ్లీ వైఫల్యానికి ఈ సీజన్‌లో వరుసగా రనౌట్లవ్వడమే కారణమని ఆర్‌సీబీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు.

ఆ రనౌట్లే..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యంపై స్పందించిన సంజయ్ బంగర్.. ఫామ్ అందుకునేందుకు అతను చాలా ట్రై చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ' రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో విరాట్ కోహ్లీ నిలకడగా రాణించే ప్లేయర్. కానీ.. ప్రతి ఆటగాడి కెరీర్‌లో ఇలాంటి చేదు అనుభవాలు మామూలే. వాస్తవానికి ఐపీఎల్ 2022 సీజన్‌ను కోహ్లీ చాలా బాగా ఆరంభించాడు. ముంబై ఇండియన్స్‌తో పుణే వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీని గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. కానీ.. ఆ తర్వాత అయిన రనౌట్లు కోహ్లీ లయని దెబ్బతీశాయి.

శక్తి మేర ప్రయత్నిస్తున్నాడు..
ఫామ్ అందుకునేందుకు చాలా ట్రై చేస్తున్నాడు. నిస్సందేహంగా తన శక్తి మేరకు ప్రతిదీ చేస్తున్నాడు. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో పాటు బ్యాటింగ్ టెక్నిక్‌పై దృష్టిసారించాడు. ఏమాత్రం ఒత్తిడికి లోను కావడం లేదు. కావాల్సినంత విశ్రాంతిని కూడా తీసుకుంటున్నాడు. భవిష్యత్తులో కూడా ఇలానే ఉండనున్నాడు. టీమిండియా కీలక ఆటగాడు కావడంతోనే అంతా కోహ్లీ ఫామ్‌పై ఫీలవుతున్నారు. త్వరలోనే అతను ఫామ్ అందుకుంటాడు 'అని సంజయ్ బంగర్ వెల్లడించాడు.

కెప్టెన్సీ ఒత్తిడి లేకున్నా..
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో డేవిడ్ విల్లేతో సమన్వయ లోపం కారణంగా రనౌటైన విరాట్ కోహ్లీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌తో మిస్ కమ్యూనికేషన్ కారణంగా రనౌటయ్యాడు. ఐపీఎల్‌లో ఒకే ఏడాది నాలుగు సెంచరీలతో పాటు అత్యధిక పరుగులు 976 చేసిన ఆటగాడిగా టాప్ రికార్డ్‌లో ఉన్న కోహ్లీ.. గత రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌట్‌వడంపై ఆర్సీబీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్సీ భారం కాకూడదని ఆర్సీబీతో పాటు టీమిండియా కెప్టెన్సీని కూడా వదిలేసిన కోహ్లీ.. స్వేచ్ఛగా చెలరేగిపోతాడని అందరూ ఊహిస్తే? కెరీర్‌లో అత్యంత చెత్త ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశపరుస్తున్నాడు.

ఘోర పరాజయం..
సన్‌రైజర్స్‌తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ.. 16.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. సుయాశ్ ప్రభుదేశాయ్(15), గ్లేన్ మ్యాక్స్‌వెల్(11) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. విరాట్ కోహ్లీ(0)తో పాటు అనూజ్ రావత్(0), దినేశ్ కార్తీక్(0) డకౌట్‌గా వెనుదిరిగారు. సన్‌రైజర్స్ హైదరబాద్ బౌలర్లు మార్కో జాన్సెన్(3/25), నటరాజన్(3/10) మూడేసి వికెట్లు తీయగా.. జగదీష్ సుచీత్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌లకు తలో వికెట్ దక్కింది.
అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 72 పరుగులు చేసి 72 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 47) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. కేన్ విలియమ్సన్(16 నాటౌట్), రాహుల్ త్రిపాఠి(7 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications