Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: రెండు కొత్త జట్లు ఇవే.. ఎవరికి దక్కాయంటే..?

RPSG group named owners for Lucknow team

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగే కొత్త జట్ల వివరాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోమవారం వెల్లడించింది. అందరూ ఊహించనట్లుగానే అహ్మదాబాద్ బేస్‌గా ఓ జట్టు.. లక్నో బేస్‌గా మరో జట్టు వచ్చే సీజన్‌లో అలరించనుంది. అయితే అహ్మదాబాద్ బేస్ టీమ్‌ను సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ సొంతం చేసుకోగా.. సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్‌పీఎస్‌జీ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది.

ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ రూ. 7090 కోట్లతో అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సొంతం చేసుకోని మళ్లీ ధనాధన్ లీగ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో ఆర్‌ఎస్‌జీ గ్రూప్‌కు చెందిన రైజింగ్ పునే సూపర్‌జెయింట్ టీమ్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

ఇక లక్నో ఫ్రాంచైజీని సీవీసీ ఓనర్స్ రూ. 5625 కోట్లకు దక్కించుకుంది. ఈ రెండు జట్ల కోసం మొత్తం 9 బడా కంపెనీలు పోటీపడ్డాయి. అహ్మదాబాద్, కటక్, ధర్మశాల, గౌహతి, ఇండోర్, లక్నో నగరాలకు బిడ్డింగ్ జరగ్గా అన్ని కంపెనీలు అహ్మదాబాద్, లక్నోకు బిడ్డింగ్ వేసాయి. అత్యధికంగా గోయెంకాకు చెందిన ఆర్‌పీఎస్‌జీ లక్నోతో పాటు అహ్మదాబాద్‌కు రూ. 7090 కోట్లు బిడ్ వేసింది. ఈ రెండు నగరాలకే కాకుండా ఇండోర్‌కు 4,790 కోట్లు పెట్టేందుకు సిద్దమైంది. హయ్యెస్ట్ కోట్ చేసిన ఈ కంపెనీకే లక్నో ఫ్రాంచైజీ దక్కింది. ఆ తర్వాత ఉన్న సీవీసికి అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ వరించింది.

ఇక ముందు నుంచి వినిపించిన ఆదాని కంపెనీ రూ. 5, 100 కోట్లు మాత్రమే బిడ్ వేసి నిరాశగా వెనుదిరిగింది. ఇక అహ్మదాబాద్‌ను అదానీ గ్రూప్‌, లక్నోని మాంచెస్టర్ యునైటెడ్ కైవసం చేసుకున్నట్లు ప్రచారం జరిగినా అదంతా ఉత్తదేనని తేలిపోయింది. ఇక లీగ్‌లో కొత్త జట్ల రాకతో మెగావేలం జరగనుంది. దాంతో ప్రస్తుతం జట్లలో ఉన్న ఆటగాళ్లంతా మారనున్నారు.

Story first published: Monday, October 25, 2021, 21:13 [IST]
Other articles published on Oct 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+