లక్నోతో ఎలిమినేటర్ మ్యాచ్... ఆర్‌సీబీని కలవరపెడుతున్న చెత్త రికార్డు!

కోల్‌కతా: ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్కీగా ప్లే ఆఫ్స్ చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ).. నేడు(బుధవారం) మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్.. శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో క్వాలిఫయర్-2లో ఆడనుండగా.. ఓడిన టీమ్ ఇంటిబాట పట్టనుంది. అయితే లక్నోతో జరిగే ఈ కీలక పోరు ముందు ఆర్‌సీబీ అభిమానులను ఓ చెత్త రికార్డు కలవరపెడుతోంది. అసలు ఆర్‌సీబీకి ఇంత వరకు ఎలిమినేటర్ మ్యాచే కలిసి రాలేదు. ప్లే ఆఫ్స్ రికార్డులు సైతం అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఆర్‌సీబీకి కలిసి రాని ఎలిమినేటర్..
2008 నుంచి ఇప్పటి వరకు మొత్తం 14 ఐపీఎల్ సీజన్లు ముగియగా.. బెంగళూరు జట్టు ఏడు సార్లు ప్లేఆఫ్స్‌లో ఆడింది. కానీ.. కనీసం ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది. ఈ 14 ఏళ్లలో మూడు సార్లు ఫైనల్లో కూడా ఆడింది. అయినప్పటికీ నిరాశ తప్పలేదు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే? ఐపీఎల్ 2020, 2021 సీజన్లలో ప్లేఆఫ్స్‌కి చేరిన బెంగళూరు టీమ్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లోనే ఓడి ఇంటిబాట పట్టింది. దాంతో.. ఈరోజు లక్నోతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ హ్యాట్రిక్ నమోదు చేస్తుందేమో? అని అభిమానులు కంగారుపడుతున్నారు.

ప్లే ఆఫ్స్ రికార్డులు కూడా..
2020లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన బెంగళూరు, 2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. ఓవరాల్‌గా ప్లేఆఫ్స్‌లో ఆర్‌సీబీకి మెరుగైన రికార్డ్ లేదు. ఆ జట్టు ఇప్పటి వరకూ 13 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో గెలిచింది కేవలం ఐదింట్లో మాత్రమే. 2009, 2011, 2016లో అడ్డంకుల్ని దాటుకుని ఫైనల్‌కి చేరినా.. ఒత్తిడిని అధిగమించలేక టైటిల్ చేజార్చుకుంది. అయితే.. గత సీజన్లతో పోలిస్తే? ఆర్‌సీబీ ఈ ఏడాది మంచి సమతూకంతో కనిపిస్తోంది. దాంతో.. టైటిల్ గెలిచే అవకాశాలూ లేకపోలేదని మాజీ క్రికెటర్లు, అభిమానులు జోస్యం చెబుతున్నారు.

లక్ ఫేవర్‌గా ఉంది..
అయితే ఈ సీజన్‌లో ఆర్‌సీబీ బలంగా ఉండటంతో పాటు కొంత లక్ కూడా ఫేవర్ చేస్తోంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ అద్భుత విజయాన్నందుకుంది. సీజన్ ఆసాంతం దారుణంగా విఫలమైన విరాట్.. ఈ మ్యాచ్‌లో తన విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించడంతో ఆర్‌సీబీ లక్కీగా ప్లే ఆఫ్స్ చేరింది. ముంబైతో జరిగిన ఆ మ్యాచ్‌ను సునాయసంగా గెలవాల్సిన ఢిల్లీ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ఈ క్రమంలోనే ఈసారి ఆర్‌సీబీ టైటిల్ గెలుస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications