IPL 2022: ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరకుండా ముంబై ఇండియన్స్ కుట్ర!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) భవితవ్యం ముంబై ఇండియన్స్‌పై ఆధారపడి ఉంది. వరుస పరాజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఆర్‌సీబీకి మెరుగైన అవకాశాలుంటాయి. అయితే దీనికి ముందు ఆర్‌సీబీ గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో భారీ విజయాన్నందుకోవాలి. ప్రస్తుతం 7 విజయాలతో 14 పాయింట్లతో టేబుల్‌లో ఐదో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ.. టైటిల్ రేసులో నిలవాలంటే గుజరాత్‌పై ఖచ్చితంగా గెలవాలి. అంతేకాకుండా 14 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై చేతిలో ఓడాలి.
ముంబై గెలవాలని...
ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ గెలవాలని ఆర్‌సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం కోర్ టీమ్‌ను పరీక్షిస్తామంటూ బెంచ్ ఆటగాళ్లకు అవకాశమిస్తూ గెలిచే మ్యాచ్‌ల్లో ఓటమిపాలవుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ నుంచి ప్రయోగాలు చేపట్టిన ముంబై ఇండియన్స్.. ఆ మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్ వంటి కీలక ప్లేయర్లను తప్పించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెగ్యూలర్ స్పిన్నర్లు ఇద్దరిని పక్కనపెట్టి జయంత్ యాదవ్, మయాంక్ మార్కెండేలను ఆడించింది. ఈ ఇద్దరు పెద్దగా ప్రభావం చూపకపోగా.. డెత్ బ్యాటింగ్ లేక సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో 3 పరుగులతో ఓటమిపాలైంది.
అర్జున్ టెండూల్కర్‌కు చాన్స్..
ఇక ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. చివరి మ్యాచ్‌లోనూ ఇప్పటి వరకు అవకాశం రాని యువ ఆటగాళ్లకు చోటిస్తామని తెలిపాడు. విజయం కన్నా భవిష్యత్తు నేపథ్యంలో కోర్ టీమ్‌ను పరీక్షించుకోవడం తమకు అత్యంత ముఖ్యమని చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఆర్‌సీబీ అభిమానులను కలవరపెడుతున్నాయి. రోహిత్ చెప్పినదాట్టి బట్టి చూస్తే జట్టులో ఇప్పటి వరకు అవకాశం దక్కించుకోని ఆర్యన్ జుయాల్(వికెట్ కీపర్), అర్జున్ టెండూల్కర్(బౌలర్), ఆకాశ్ మధ్వాల్(బౌలర్), రాహుల్ బుద్ది(బ్యాటర్)లు అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరవద్దనే..
ఈ నలుగురికి అవకాశం ఇవ్వాలంటే.. రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్, జస్‌ప్రీత్ బుమ్రా, రమణ్ దీప్ సింగ్‌లు తప్పుకోవాల్సి ఉంటుంది. కెప్టెన్ రోహిత్ కొనసాగినా తిలక్ వర్మను పక్కనపెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ముంబై ఇండియన్స్ టీమ్ అత్యంత బలహీనంగా మారుతోంది. ఇది ఢిల్లీ క్యాపిటల్స్‌కు అడ్వాంటేజ్‌గా మారనుంది. ముంబైని ఓడించడమే కాకుండా భారీ విజయం సాధించి పాయింట్స్ టేబుల్‌లో మెరుగైన స్థానంలో నిలిచే అవకాశం కూడా ఢిల్లీకి కలుగుతోంది. దీంతో ముంబై మేనేజ్‌మెంట్ తీరుతో ఆర్‌సీబీ అభిమానులు రగిలిపోతున్నారు. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరవద్దనే కసితోనే ఆ జట్టు ఇలా చేస్తుందని కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications