
మాకేం అడ్వాంటేజ్..
'మాకు ఎలాంటి హోమ్ అడ్వాంటేజ్ ఉండదు. గత రెండేళ్లుగా ఇక్కడ మేం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గతేడాది ఇతర టీమ్స్ అయినా కొన్ని మ్యాచ్‌లు ముంబైలో ఆడాయి. మాకు ఎలాంటి అడ్వాంటేజ్ ఉండదు. పైగా ఇది కొత్త టీమ్. జట్టులో 70-80 శాతం కొత్తవాళ్లే ఉన్నారు. వీళ్లకు ముంబైలో ఆడిన అనుభవం లేదు.'అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఇక ముంబైలో మ్యాచ్‌లు జరగడం.. సొంత అభిమానులు ఎక్కువగా ఉండటం రోహిత్ సేనకు కలిసి వస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇతర ఫ్రాంచైజీలు సైతం ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

సూర్య కోసం వెయిటింగ్
ఇక సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్ గురించి మాట్లాడిన రోహిత్.. అతను ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో ఉన్నాడని, అతని రాక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు. ఎన్‌సీఏ నుంచి క్లియరెన్స్ రాగానే అతను జట్టుతో కలుస్తాడని చెప్పాడు. దాంతో సూర్య ఫస్ట్ మ్యాచ్ ఆడటం లేదనే విషయంపై అధికారికంగా క్లారిటీ వచ్చింది. బ్యాటింగ్ పొజిషన్ గురించి ప్రశ్నించగా.. ఇషాన్ కిషన్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగుతానని చెప్పిన రోహిత్.. ఇదేం ప్రశ్న అంటూ జర్నలిస్ట్‌ను ప్రశ్నించాడు.

హార్దిక్ పాండ్యాది కీలక పాత్ర..
ఈ ఐపీఎల్‌లో తాను కొంచెం భిన్నంగా కనిపించాలనుకుంటున్నాని చెప్పిన రోహిత్.. అన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు. ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా చేసిన సేవలు వెల కట్టలేనివన్న రోహిత్.. ముంబై విజయాల్లో అతనిది కీలక పాత్రని చెప్పాడు. హార్దిక్ లేకుంటే ముంబైకి ఆ విజయాలు దక్కేవికాదని వెల్లడించాడు. ఐపీఎల్ 2022 సీజన్ కోసం బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనల పట్ల రోహిత్ సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ రెండు రివ్యూల నిబంధన మంచిదని అభిప్రాయపడ్డాడు.

ఆ నిబంధన సూపర్..
'రెండు రివ్యూలు ఉండే నిబంధన చాలా మంచిది. ఎందుకంటే గేమ్‌లో అప్పుడప్పుడు కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. వాటిని సరిచేసుకునే అవకాశం దక్కుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా రెండు రివ్యూలు ఉన్నాయి. కాబట్టి ఐపీఎల్‌లో కూడా ఈ నిబంధన ఉండాల్సిందే. ఇది చాలా మంచి నిర్ణయం అనేది నా అభిప్రాయం'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
