న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ఆర్‌సీబీ కొంపముంచిన దినేశ్ కార్తీక్ రనౌట్.. సూపర్ విక్టరీతో టాప్ లేపిన రాజస్థాన్!

 IPL 2022: Riyan Parag and bowlers hand RCB a crushing defeat

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బౌలింగ్‌లో రాణించినా.. చెత్త బ్యాటింగ్‌తో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సంజూ శాంసన్(27) పర్వాలేదనిపించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, వానిందు హసరంగ, హజెల్ వుడ్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం ఆర్‌సీబీ 19.3 ఓవర్లలో 115 పరుగులకు కుప్పకూలింది. ఫాఫ్ డుప్లెసిస్(23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు, ప్రసిధ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో రాజస్థాన్ టేబుల్ టాపర్‌గా నిలిచింది.

విరాట్ మళ్లీ విఫలం..

విరాట్ మళ్లీ విఫలం..

145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి మరోసారి శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ(9) మళ్లీ విఫలమయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లో లైఫ్ వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో బంతిని విరాట్ ఫ్లిక్ చేయబోగా గాల్లోకి లేచిన బంతి.. షార్ట్ స్క్వెర్ లెగ్ ఫీల్డర్‌ డారిల్ మిచెల్ చేతిలో పడింది. అంతా కోహ్లీ ఔటనుకున్నారు. కానీ క్యాచ్ అందుకునే ముందు బంతి పిచ్ అవ్వడంతో కోహ్లీ ఊపిరి పీల్చుకున్నాడు. మిల్లీ మీటర్ దూరంలో డకౌట్‌ను తప్పించుకున్న కోహ్లీ.. ప్రసిధ్ కృష్ణ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో బౌన్సర్‌కు బలయ్యాడు. బంతిని సరిగ్గా అంచనా వేయలేక క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

దెబ్బతీసిన కుల్దీప్ సేన్..

దెబ్బతీసిన కుల్దీప్ సేన్..

ఆ తర్వాత రజత్ పటిదార్ క్రీజులోకి రాగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 3 ఫోర్లు, సిక్స్‌తో క్రీజులో కుదురుకున్న ఫాఫ్ డుప్లెసిస్‌(23)ను యువ బౌలర్ కుల్దీప్ సేన్ ఔట్ చేశాడు. ఆ మరుసటి బంతికే డేంజర్ మ్యాక్స్‌వెల్(0) కూడా ఔటవ్వడంతో ఆర్‌సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆచితూచి ఆడిన రజత్ పటిదార్(16), సుయశ్ ప్రభుదేశాయ్‌లను అశ్విన్ తన వరుస ఓవర్‌లో ఔట్ చేయడంతో ఆర్‌సీబీ 65 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది.

 కొంపముంచిన కార్తీక్ రనౌట్..

కొంపముంచిన కార్తీక్ రనౌట్..

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ బౌండరీ బాది ఆశలు రేకెత్తించాడు. కానీ నాటకీయపరిణామాల్లో అతను రనౌటయ్యాడు. షాబాజ్ అహ్మద్‌తో సమన్వయ లోపంతో కార్తీక్ పెవిలియన్ చేరాడు. యుజ్వేంద్ర చాహల్ వేసిన 13వ ఓవర్ నాలుగో బంతిని షాబాజ్ సిల్లీ మిడాన్ దిశగా ఆడి క్విక్ సింగిల్‌కు మూమెంటమ్ ఇచ్చాడు. అయితే బంతి ఫీల్డర్ వైపు వెళ్తుందని చూడకుండా దినేశ్ కార్తీక్ హాఫ్ పిచ్ ధాటగా.. షాబాజ్ వద్దని వారించాడు. దాంతో దినేశ్ కార్తీక్ వెనక్కి తిరగ్గా.. ఫీల్డర్ ఇచ్చిన బంతిని చాహల్ అందుకోలేకపోయాడు. కానీ ఆ వెంటనే బంతిని అందుకొని వికెట్లను కొట్టేసాడు. అయితే చాహల్ బంతిని సరిగ్గా అందుకోకపోవడంతో కార్తీక్ బచాయించాడని అంతా అనుకున్నారు. కానీ అప్పటీకీ క్రీజులోకి రాకపోవడంతో ఔటయ్యాడు. దాంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు మళ్లీంది.

 పేక మేడలా..

పేక మేడలా..

ఆ తర్వాత షాబాజ్(17), హసరంగా (18) భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. బౌండరీ కొట్టిన మహమ్మద్ సిరాజ్ అదే ప్రయత్నంలో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. హర్షల్ పటేల్ భారీ సిక్సర్ బాదినా.. కుల్దీప్ ఓవర్‌లో క్యాచ్ ఔటయ్యాడు. దాంతో ఆర్‌సీబీ మరో మూడు బంతులు మిగిలుండగానే 115 పరుగులకు కుప్పకూలింది.

Story first published: Tuesday, April 26, 2022, 23:35 [IST]
Other articles published on Apr 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X