Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs KKR మ్యాచ్‌లో తళక్కుమన్న రిషభ్ పంత్ పిల్ల.. ఫొటోలు వైరల్!

 IPL 2022: Rishabh Pant girlfriend Isha Negi spotted DC match against KKR

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ మిస్టరీ గర్ల్ తళక్కుమన్నది. అందానికే అసూయపుట్టేలా ఉన్న ఆ బ్యూటీనీ టీవీ కెమెరాలు పదే పదే చూపించాయి. ఆ బ్యూటీ అందానికి ఫిదా అయిన నెటిజన్లు ఈ అందాల భామ ఎవరా? అని ఆరా తీయగా.. రిషభ్ పంత్ గర్ల్ ఫ్రెండ్ ఇషా నేగి అని తెలిసింది. దాంతో ఈ అమ్మడు ఫొటోలను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

ఇషా నేగితో గత కొంత కాలంగా ప్రేమాయణం నడిపిస్తున్న రిషభ్ పంత్ ..ఈ విషయాన్ని అతనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు. ఇషా నేగితో చనువుగా దిగిన ఓ ఫోటోను షేర్ చేసిన పంత్.. 'నిన్ను నేనెప్పుడూ హ్యాపీగా ఉంచాల‌నుకుంటున్నాను.. ఎందుకంటే నేను హ్యాపీగా ఉండ‌టానికి నువ్వే కారణం'అనే క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో వీరిద్దరూ పీకల్లోతూ లవ్‌లో ఉన్నట్లు అందరికీ అర్థమైంది.

మరోవైపు ఇషా కూడా పంత్‌పై తనకున్న ప్రేమను బహిర్గతం చేసింది. ఆమె కూడా పంత్‌తో దిగిన ఫోటోలను త‌న ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 'నువ్వే నా మ‌గాడివి, నువ్వే నా ఆత్మవి, నా బెస్ట్ ఫ్రెండ్‌వి, నా జీవితంలోని ప్రేమవి నువ్వే'అని క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. వృత్తి రిత్యా ఇంటీరియర్‌ డిజైనర్‌ అయిన ఇషా.. అమిటీ యూనివర్శిటీ నుంచి బీఏ హాన‌ర్స్‌ డిగ్రీ పొందింది. ప్రస్తుతం మోడల్‌గా రాణిస్తోంది.

ఐపీఎల్ 2022 సీజన్‌లో పంత్‌కు మద్దతు తెలపడానికి మ్యాచ్‌కు రావడం ఇదే తొలిసారి. దాంతో నెటిజన్లు పంత్ పిల్ల అంటూ ఫొటోలు షేర్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసింది. నితీష్ రాణా (34 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57), శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 4 ఫోర్లతో 42) రాణించారు. కుల్దీప్ యాదవ్(4/14), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/18) కేకేఆర్ పతనాన్ని శాసించగా.. చేతన్ సకారియా, అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Thursday, April 28, 2022, 23:13 [IST]
Other articles published on Apr 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+