Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs KKR: గిదేందోయ్ పంత్.. అప్పుడు నో బాల్ కోసం.. ఇప్పుడు కాదని అంపైర్‌తో లొల్లి! పద్దతేనా?

 IPL 2022: Rishabh Pant Argues With Umpires Regarding No Ball In KKR Match

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో నోబాల్ కోసం రచ్చ చేసి భారీ జరిమానాను ఎదుర్కొన్న పంత్.. మళ్లీ అదే నో బాల్ విషయంలో అంపైర్‌తో గొడవకు దిగాడు. కాకపోతే ఈ సారి హద్దులు ధాటకుండా జాగ్రత్తపడ్డాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా.. పంత్ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. గిదేం పద్దతంటూ నిలదీస్తున్నారు. అప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా ఏందని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది.

అసలేం జరిగిందంటే..?

కోల్‌కతా ఇన్నింగ్స్ సందర్భంగా 17వ ఓవర్ మూడో బంతిని లలిత్ యాదవ్ హై నో‌బాల్‌గా వేయగా... నితీష్ రాణా భారీ సిక్సర్ బాదాడు. అయితే అది నోబాల్? కాదా? అని ఇద్దరు అంపైర్లు మాట్లాడుకొని తమ నిర్ణయాన్ని ప్రకటించారు. బ్యాటర్ పొట్ట భాగం కంటే పైకి రావడంతో నో బాల్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ నిర్ణయం గురించి పంత్ అంపైర్‌తో వాదించాడు. క్లియర్ నో బాల్ అని వాదించడంతో మౌనంగా వెళ్లిపోయాడు.

ఇదే నో బాల్ కోసం..

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఇదే నో బాల్ కోసం పంత్ రచ్చ రచ్చ చేశాడు. రాజస్థాన్ బౌలర్ మెకాయ్ వేసిన నో బాల్ విషయంలో అంపైర్లు తప్పిదం చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. తమ ఆటగాళ్లను వచ్చేయమని సూచించాడు. తమ కోచ్‌ను మైదానంలోకి పంపి అంపైర్లతో వాదించేలా చేశాడు. చివరకు మ్యాచ్ రిఫరీ ఆగ్రహానికి గురై 100 శాతం మ్యాచ్ ఫీజును రూ1.16 కోట్లను జరిమానాగా చెల్లించాడు.

ఇదేం పద్దతంటూ..

అప్పుడు అదే నో బాల్ కోసం రచ్చ చేసిన పంత్.. ఇప్పుడు నో బాల్ కాదంటూ అంపైర్‌తో వాదించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇదేం పద్దతంటూ నిలదీస్తున్నారు. ఫెయిర్ ప్లే అవార్డు పంత్ దే అంటూ నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. పంత్ తన పద్దతిని మార్చుకోవాలని, ప్రతీ దానికి ఇలా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

 నితీష్ రాణా హాఫ్ సెంచరీ..

నితీష్ రాణా హాఫ్ సెంచరీ..

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/14), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/18) చెలరేగడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసింది. నితీష్ రాణా (34 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) కు తోడుగా శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 4 ఫోర్లతో 42) రాణించడంతో కేకేఆర్ పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. చివర్లో రింకూ సింగ్(23) రాణించగా.. ఆఖరి ఓవర్‌లో ముస్తాఫిజుర్ దెబ్బతీసాడు. 2 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసాడు. చేతన్ సకారియా, అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Thursday, April 28, 2022, 22:39 [IST]
Other articles published on Apr 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+