Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

David Warner: మీకు మీ ఫ్రాంచైజీకి ఓ దండం రా అయ్యా!

IPL 2022 retension: David Warner Doesnt Want To Play For Sunrisers Hyderabad

హైదరాబాద్: ఐపీఎల్ 2022 మెగావేలానికి టైమ్ దగ్గర పడుతుండటంతో రిటెన్షన్ జాబితాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ విస్తరించాలనే లక్ష్యంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొత్తగా రెండు జట్లను తీసుకురావడంతో మేగా వేలం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కొత్త జట్ల ప్రక్రియను పూర్తి చేసిన భారత క్రికెట్ బోర్డు భారీ ధరకు రెండు ఫ్రాంచైజీ హక్కులను కట్టబెట్టింది.

అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సీవీసి క్యాపిటల్స్ రూ.5625 కోట్లుకు దక్కించుకోగా.. లక్నో బేస్ టీమ్‌ను రూ. 7090 కోట్లకు ఆర్‌పీఎస్‌జీ సొంతం చేసుకుంది. కొత్త జట్ల ఎంపిక కూడా పూర్తవ్వడంతో మెగా వేలం నిర్వహణపై బీసీసీఐ దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని సిద్దం చేసి ఫ్రాంచైజీలకు అందజేసింది. నవంబర్ 30లోపు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించాలని ఆదేశించింది.

వద్దురా అయ్యా..

దాంతో ఏ జట్టు ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటుందనే అంచనాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్‌ను రిటైన్ చేసుకుంటుందా? లేదా? అనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఆడే అవకాశాలు లేవని డేవిడ్ వార్నర్ సంకేతాలు ఇచ్చాడు.

ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా ఫ్రాంచైజీ యాజమాన్యంతో తలెత్తిన విభేధాల నేపథ్యంలో అతన్ని రిటైన్ చేసుకోదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ అభిమాని.. చేసిన కామెంట్‌కు వార్నర్ ఇచ్చిన రిప్లే చర్చనీయాంశమైంది.

వీఆర్ ఆరేంజ్ ఆర్మీ ట్విటర్ యూజర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ జాబితాను అంచనా వేయండంటూ పెట్టిన పోస్ట్‌కు ఓ యూజర్.. టామ్ మూడీ హెడ్ కోచ్, డేవిడ్ వార్నర్ కెప్టెన్ అంటూ కామెంట్ చేశాడు. దీనికి వార్నర్.. నో థ్యాంక్స్ అని బదులిచ్చాడు. మీకు మీ ఫ్రాంచైజీకి ఓ దండం రా అయ్యా అని పరోక్షంగా చెప్పుకొచ్చాడు.

కారణం లేకుండా..

కారణం లేకుండా..

ఎలాంటి కారణం లేకుండా జట్టు నుంచి తొలగించడం, కెప్టెన్సీ నుంచి తప్పించడంతో బాధేసిందని ఇటీవల వార్నర్ తెలిపాడు. ఈ విషయంపై తాను ఎలాంటి ఫిర్యాదులు చేయాలనుకోవడం లేదన్నాడు. తనకు ఇంకా ఐపీఎల్‌ ఆడేందుకు మరో అవకాశం ఉందనే నమ్ముతున్నానని వార్నర్ ధీమా వ్యక్తం చేశాడు.

'కొన్నేళ్ల పాటు ఎంతో ఇష్టపడిన జట్టు ఉన్నట్టుండి ఏ తప్పూ లేకుండా, ఏ కారణం లేకుండా నన్ను తొలగించడం, కెప్టెన్సీ నుంచి తప్పించడం చేస్తే చాలా బాధపడ్డాను. అయితే ఈ విషయంపై నేనెలాంటి ఫిర్యాదులు చేయాలనుకోవడం లేదు. భారత్‌లో నాకెంతో మంది అభిమానులున్నారు. వారు ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచారు. వాళ్ల కోసమే నేను ఈ ఆట ఆడుతున్నా. అభిమానులను అలరించడానికే నేను ఉన్నాను' అని వార్నర్ అన్నాడు.

ఐపీఎల్ విఫలమై..

ఐపీఎల్ విఫలమై..

డేవిడ్ వార్నర్‌ ఐపీఎల్ 14 సీజన్‌లో పూర్తిగా తేలిపోయాడు. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాటర్‌గా విఫలమయ్యాడు. భారత్‌లో జరిగిన తొలి అర్ధ భాగంలో ఫర్వాలేదనిపించిన వార్నర్.. యూఏఈలో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండు అర్ధ శతకాలతో 195 పరుగులు మాత్రమే చేశాడు. ఇక హైదరాబాద్ జట్టు ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి అత్యంత దారుణమైన ప్రదర్శన చేసింది.

ఈ క్రమంలోనే సన్‌రైజర్స్‌ యాజమాన్యం వార్నర్‌ను పక్కనపెట్టి.. కెప్టెన్సీ బాధ్యతలను కేన్‌ విలియమ్సన్‌కు అప్పగించింది. ఇక ఐపీఎల్ అనంతరం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో దేవ్ 289 పరుగులతో చెలరేగి.. ఆస్ట్రేలియా తొలిసారి పొట్టి కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

Story first published: Monday, November 29, 2021, 17:57 [IST]
Other articles published on Nov 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+