IPL 2022: అందుకే ఆ నో బాల్ గురించి థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయలేదు!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ తప్పిదం తీవ్ర దుమారం రేపింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 15 పరుగులతో రాజస్థాన్ రాయల్స్ గెలిచినా చివర్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంపైర్ తప్పిదంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రవీణ్ ఆమ్రె మైదానంలోకి దూసుకెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగగా పంత్.. డగౌట్ నుంచి తమ ఆటగాళ్లను వెనక్కి వచ్చేయాలని సూచించాడు. అతనికి శార్దూల్ ఠాకూర్ కూడా వత్తాసు పలకడంతో మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఫీల్డర్ జోస్ బట్లర్‌తో కూడా పంత్ వాగ్వాదానికి దిగాడు.

నో బాల్ ఇవ్వకపోవడంతో..
భారీ లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 36 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్‌ను మెక్ కాయ్ వేయగా.. క్రీజులో ఉన్న విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ రోవ్‌మన్ పావెల్ వరుసగా మూడు బంతులను భారీ సిక్సర్లుగా మలిచాడు. అయితే మెకాయ్ మూడో బంతిని హై ఫుల్ టాస్‌గా సంధించగా.. పావెల్ అద్భుతంగా సిక్సర్ కొట్టాడు. అయితే ఈ పుట్ టాస్ నోబాల్‌లా అనిపించింది. కానీ అంపైర్ నితీన్ మీనన్ మాత్రం బాల్ డిప్ అవుతుందని భావించి ఫెయిర్ డెలివరీగా ప్రకటించాడు. అప్పటికే ఢిల్లీ డగౌట్‌లోని ప్లేయర్లు, కోచ్‌లు నో బాల్ అంటూ అరిచారు. థర్డ్ అంపైర్ సాయన్ని అయినా కోరండంటూ.. సూచించారు. కానీ నితీన్ మీనన్ మాత్రం స్పందించలేదు. క్రికెట్ అభిమానులు సైతం సందేహంగా ఉన్నప్పుడు థర్డ్ అంపైర్ సమీక్ష కోరాల్సిందని అభిప్రాయపడ్డారు.

అందుకే థర్డ్ అంపైర్ రిఫర్ చేయలేదు..
అయితే నిబంధనల ప్రకారమే నితిన్ మీనన్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయలేదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆన్ ఫీల్డ్ అంపైర్లు బ్యాట్స్‌మన్ ఔటైనప్పుడు.. ఫ్రంట్ ఫూట్ నో బాల్స్ గురించే థర్డ్ అంపైర్ సమీక్ష కోరాలి. ఈ నిబంధన నేపథ్యంలోనే మెక్‌కాయ్ వేసిన ఆ నోబాల్‌పై ఫీల్డ్ అంపైర్లు సమీక్షకు వెళ్లలేదు. బ్యాట్స్‌మన్ ఔటైనప్పుడు నిర్ణీత సమయంలోపూ అతను ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేయవచ్చు. అలాగే బౌలింగ్ టీమ్ కెప్టెన్ లేదా తాత్కలిక సారథి కూడా బ్యాటర్ ఔటైనా ఫీల్డ్ అంపైర్ ఇవ్వకపోతే రివ్యూ తీసుకోవచ్చు. క్యాచ్, రనౌట్, స్టంపౌట్స్, బౌండరీలు సందేహంగా ఉన్నప్పుడు తప్పా.. మిగతా వాటి( వైడ్, హై నోబాల్) గురించి ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరడానికి నిబంధనలు ఒప్పుకోవు.

బట్లర్ తీన్మార్..
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో 116) ఈ సీజన్‌లో మూడో సెంచరీతో చెలరేగగా... దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) అర్ధ సెంచరీ చేశాడు. ఆపై కెప్టెన్ సంజు శాంసన్ (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46 నాటౌట్) కూడా చెలరేగాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 207 పరుగులు చేసి ఓడిపోయింది. రిషభ్ పంత్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), లలిత్ యాదవ్ (24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), పృథ్వీ షా (27 బంతుల్లో5 ఫోర్లు, 1 సిక్స్‌తో 37) రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications