Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: కేజీఎఫ్-2 చూసిన ఆర్‌సీబీ ఆటగాళ్లు.. విజిల్స్‌తో రచ్చ చేసిన సిరాజ్! రాకీ భాయ్ అంటూ...

 IPL 2022: RCB Team Watches Yashs KGF Chapter 2 Movie In Special Screening Check Out Players Response

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. ఇప్పటికే 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విఫలమవుతున్నా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, దినేశ్ కార్తీక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో దూసుకెళ్తుంది. బౌలింగ్‌లో హర్షల్ పటేల్ పొదుపైన బౌలింగ్‌కు హజెల్ వుడ్ తోడవ్వడం మరింత బలంగా మారింది. గత మ్యాచ్‌లో పటిష్టమైన లక్నో సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించిన ఆర్‌సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కీలక పోరుకు సిద్దమవుతోంది. అయితే తాజాగా ఆర్‌సీబీ ఆటగాళ్లు కేజీఎఫ్-2 సినిమాను చూసారు.

స్పెషల్ ప్రీమియర్ షో..

స్పెషల్ ప్రీమియర్ షో..

టీమ్ హోటల్లో ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రీమియర్ షోను సన్నిహితులు, సహచర ఆటగాళ్లతో తిలకించారు. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్‌ను ఆస్వాదించారు. ఆటగాళ్లు సినిమా చూసిన విషయాన్ని ఆర్‌సీబీ తమ యూట్యూబ్ చానెల్ వేదికగా పంచుకుంది. సినిమా చూసిన తర్వాత ఆటగాళ్ల రియాక్షన్‌ను షేర్ చేసింది. ఇక సినిమా వీపరీతంగా నచ్చడంతో ఆర్‌సీబీ ఆటగాళ్లంతా కేజీఎఫ్ ట్రాన్స్‌లోకి వెళ్లారు.

గడ్డానికి ఫిదా..

గడ్డానికి ఫిదా..

మహమ్మద్ సిరాజ్ అయితే విజిల్స్‌తో రచ్చ రచ్చ చేశాడు. యశ్ గడ్డానికి తాను ఫిదా అయ్యానని, అద్భుతమైన మూవీ అంటూ పేర్కొన్నాడు. యశ్ స్టైల్ విపరీతంగా ఆకట్టుకుందన్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీత్ దర్శకత్వంలోనే రాబోతున్న సలార్‌పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయని ఆర్‌సీబీ ఆటగాళ్లు పేర్కొన్నారు.

కేజీఎఫ్‌ను నిర్మించిన హొంబలె ఫిల్మ్స్‌తో ఆర్‌సీబీ జట్టు కట్టిన విషయం తెలిసిందే. శాండిల్‌వుడ్‌లో టాప్ మూవీ ప్రొడక్షన్ హౌస్ అయిన హొంబలె ఫిల్మ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగందూర్‌తో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నామని 10 రోజుల క్రితమే ప్రకటించింది.

అదిరిపోయే వీడియోతో..

ఈ విషయాన్ని వెల్లడించడానికి హొంబలె ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్.. ఓ అదిరిపోయే వీడియోను రూపొందించింది. దీన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. 1:23 సెకెండ్ల నిడివి ఉన్న ఈ వీడియో- కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్‌కు ఏ మాత్రం తగ్గట్లేదు. కేజీఎఫ్ యాక్టర్స్.. ఆర్సీబీ ప్లేయర్లను మిక్స్ చేస్తూ దీన్ని చిత్రీకరించింది. పవర్‌ఫుల్ అధీరా క్యారెక్టర్‌లో నటించిన సంజయ్ దత్, ఆర్సీబీ కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, రవీనా టండన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, యష్, విరాట్ కోహ్లీల కాంబినేషన్‌ను ఇందులో అద్భుతంగా మిక్స్ చేశారు.

స్పోర్ట్స్ కాంబినేషన్ చిత్రాలు..

స్పోర్ట్స్ కాంబినేషన్ చిత్రాలు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీతో జట్టు కట్టడం వల్ల అటు చిత్ర పరిశ్రమ, ఇటు స్పోర్ట్స్ సెగ్మెంట్‌లో జాయింట్‌గా ప్రమోషన్లు చేయడం, సినిమాలను నిర్మించడం, మల్టీ ఫార్మట్‌ కంటెంట్‌తో కూడిన షార్ట్ ఫిల్మ్‌లను షూట్ చేయడం.. వంటి కార్యక్రమాలను నిర్వహించుకునే వీలు ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ-స్పోర్ట్స్ సెక్టార్‌లో జాయింట్‌గా పలు కార్యక్రమాలను రూపొందించుకోవడానికి అవసరమైన యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకుంటామని తెలిపింది హొంబలె ఫిల్మ్స్. కేజీఎఫ్-2 ఈ నెల 14 ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫిస్‌ను షేక్ చేస్తోంది.

Story first published: Thursday, April 21, 2022, 12:47 [IST]
Other articles published on Apr 21, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+