For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ఆర్‌సీబీ నిరీక్షణ ఫలించెనా? బౌలింగ్ సూపర్.. బ్యాటింగే వీక్! తుది జట్టు అంచనా ఇదే!

IPL 2022: RCB Strength, Weakness, Playoffs Chances and Playing XI Prediction

హైదరాబాద్: 'ఈ సాల కప్ నమదే' (ఈసారి కప్‌‌‌‌ మాదే).. ప్రతి ఐపీఎల్ సీజన్ కు ముందు, లీగ్ సమయంలోనూ రాయల్‌‌ చాలెంజర్స్​ బెంగళూరు (ఆర్‌‌సీబీ) అభిమానుల నినాదం. ఆకర్షణీయ ఆటగాళ్లకు ఎప్పుడూ కొదవ లేదు. జట్టులో ఎందరో స్టార్లు. సారథీ దమ్మున్నోడే! కానీ ఎందుకో.. ఆర్‌సీబీకి ఐపీఎల్‌ టైటిల్‌ అందలేదు. అమ్ములపొదిలో అన్ని అస్త్రాలూ ఉన్నా.. ట్రోఫీపై తొలి ముద్దు కోసం ఆ జట్టు నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఏనాడూ అంచనాలను అందుకోలేకపోయిన బెంగళూరు.. స్థాయికి తగని ఆటతో ప్రతి ఏటా అభిమానులను నిరాశ పరుస్తూనే ఉంది.

ఈ సారి కూడా ఆశలు మాములే. కానీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, ఈ టీమ్ పెద్దన్న ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆర్‌‌సీబీ ఈ సారి కొంచెం కల తప్పినట్లుగా కనిపిస్తోంది. ఈ ఏడాది మెగావేలంలో జట్టులోకి వచ్చిన డుప్లెసిస్​కు కెప్టెన్సీ ఇచ్చిన మేనేజ్ మెంట్.. ఈసారైనా టైటిల్ సాధించాలని ఆశిస్తోంది. చివరగా 2016లో ఫైనల్ వరకు వెళ్లిన ఆర్‌‌సీబీ.. ఆ తర్వాత మూడేళ్లు కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేకపోయింది. కానీ గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌‌ వరకు వచ్చినా.. లక్ష్యాన్ని అందుకోలేదు. దీంతో ఈ ఏడాదైనా డుప్లెసిస్‌ నేతృత్వంలోని ఆ జట్టు టైటిల్‌ను అందుకోగలదా? ఓసారి ఆటీమ్ బలాలు, బలహీనతలపై లుక్కెద్దాం..

ఆర్‌సీబీ టీమ్ బలాలు..

ఆర్‌సీబీ టీమ్ బలాలు..

ప్రతిసారి బ్యాటింగ్ బలంతో బరిలో దిగే ఆర్‌‌సీబీ ఈసారి మాత్రం బౌలింగ్ విభాగం కాస్త బలంగా కనిపిస్తోంది. వేలానికి ముందు జెమీసన్ ను వదులుకున్న ఫ్రాంచైజీ అతడి ప్లేస్ లో మరో పొడగరి హేజిల్‌‌వుడ్ ను తీసుకుంది. తను లాస్ట్ సీజన్ లో చెన్నై టీమ్ విక్టరీతో పాటు గతేడాది ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి తోడు గతేడాది పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్ ఈసారి కూడా కీలకం కానున్నాడు. ఇక సిరాజ్, సిద్దార్థ్ కౌల్ రూపంలో మరో ఇద్దరు ఇండియా బౌలర్లు, బెరెండార్ఫ్‌‌, డేవిడ్ విల్లే రూపంలో ఫారిన్ పేసర్లు ఉండనే ఉన్నారు. స్పిన్‌‌లో నంబర్ వన్ ఆల్ రౌండర్ వానిందు హసరంగ మంచి ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. అలాగే షాబాజ్‌‌ అహ్మద్, కర్ణ్ శర్మ, లామ్రోర్ వంటి ఇండియా స్పిన్నర్లతో పాటు మ్యాక్స్‌‌వెల్ కూడా తన బంతితో మాయ చేయగలగడం ఈ టీమ్ కు ప్లస్ అనొచ్చు. ఇక కెప్టెన్ డుప్లెసిస్ కూడా టీమ్‌కు సానుకూలంశం.

అతడి ఎటాకింగ్‌ కెప్టెన్సీ, ఆటను అర్థం చేసుకునే సామర్థ్యం జట్టుకు చాలా ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. బ్యాట్స్‌మన్‌గా కూడా అతడు కీలకం కానున్నాడు. గత సీజన్‌లో అతడు 16 మ్యాచ్‌ల్లో 633 పరుగులతో చెన్నై టైటిల్‌ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. డుప్లెసిస్‌, కోహ్లీల ఓపెనింగ్‌ జోడీతో ప్రత్యర్థులకు ముప్పే. ఇద్దరూ క్రీజులో పాతుకుపోగలరు. ఇద్దరూ బ్యాట్‌ ఝుళిపించగలరు. వీళ్లిద్దరు బలమైన ఆరంభాలనిస్తే.. మిగతా పని మ్యాక్స్‌వెల్‌, కార్తీక్‌ చూసుకుంటారని బెంగళూరు ఆశిస్తోంది.

బలహీనతలు

బలహీనతలు

కొద్ది మంది స్టార్లున్నా బెంగళూరు బ్యాటింగ్‌ ఒకప్పటంత గొప్పగా కనిపించట్లేదు. డివిలియర్స్‌ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద లోటే. అతడి రిటైర్మెంట్‌తో మధ్య, ఆఖరి ఓవర్లలో విధ్వంసం సృష్టించే ఓ బ్యాట్స్‌మన్‌ను ఆ జట్టు కోల్పోయింది. దీంతో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, డుప్లెసిస్‌పై మరింత భారం పడనుంది. ఇక కోహ్లీ కొంతకాలంగా సరైన ఫామ్ లో లేకపోవడం టీమ్‌‌కు మైనస్. కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ స్వేచ్ఛగా బ్యాట్ కు పని చెబితేనే టీమ్ పెర్ఫామెన్స్ ఓ తీరుగా ఉంటుంది. లేదంటే జట్టుకు కష్టాలు తప్పవు.

అదే టైమ్‌‌లో 3, 5 నంబర్లలో బ్యాటింగ్ చేసే ప్లేయర్లు ఎవరనేదానిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ ప్లేయర్ అనూజ్ రావత్ వన్‌‌డౌన్‌‌లో వచ్చే చాన్సున్నా.. కీలకమైన ఆ ప్లేస్ లో అతడు ఏమాత్రం రాణిస్తాడన్నది ప్రశ్న. లోమ్రోర్ లేదా కార్తీక్ ఐదో నంబర్‌‌లో రావొచ్చు. అయితే, ఇద్దరిలో పెద్దగా నిలకడ లేకపోవడం టీమ్ ను ఆందోళనలో పడేస్తోంది. మొత్తంగా ఆర్​సీబీ మిడిలార్డర్ బలహీనం​గా ఉంది. బ్యాటింగ్‌లో బ్యాకప్ ఆప్షన్ కూడా లేదు.

ఆర్‌‌సీబీ టీమ్

ఆర్‌‌సీబీ టీమ్

భారతీయులు: విరాట్‌‌ కోహ్లీ, అనూజ్, దినేశ్ కార్తీక్, సిసోడియా, అనీశ్వర్, హర్షల్, మహిపాల్ లామ్రోర్, షాబాజ్‌‌, ప్రభుదేశాయ్, ఆకాశ్ దీప్, సీవీ మిలింద్, కర్ణ్ శర్మ, సిరాజ్, సిద్దార్థ్ కౌల్.

ఫారిన్ ప్లేయర్లు : డుప్లెసిస్ (కెప్టెన్), హేజిల్‌‌వుడ్, బెరెండార్ఫ్‌‌, హసరంగ, డేవిడ్ విల్లే, మ్యాక్స్‌‌వెల్, ఫిన్ అలెన్.

ఆర్‌సీబీ ఫ్లే ఆఫ్స్ అంచనా..

ఆర్‌సీబీ ఫ్లే ఆఫ్స్ అంచనా..

గ్రూప్‑బిలో ఉన్న బెంగళూరు అదే గ్రూప్ లోని చెన్నై, హైదరాబాద్, పంజాబ్, గుజరాత్ తో పాటు గ్రూప్-ఎలోని రాజస్థాన్ తో రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. ముంబై, కోల్ కతా, ఢిల్లీ, లక్నోలతో ఒక్కో మ్యాచ్ లో తలపడుతుంది. ఈ నెల 27న పంజాబ్‌తో జరిగే మ్యాచ్​తో ఆర్‌‌సీబీ తమ టైటిల్ వేటను మొదలుపెట్టనుంది. అంచనాలకు అనుగుణంగా రాణిస్తే ఆర్‌సీబీ సులువుగా ప్లే ఆఫ్స్ చేరుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ 2016 సీజన్ మాదిరి చెలరేగితే ఆ జట్టుకు తిరుగే ఉండదు. ఇక తమ టీమ్ ట్రోఫీ సాధిస్తే చూడాలని ప్రతి ఫ్యాన్ కోరుకుంటున్నాడు.

ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా)

ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా)

ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్(కీపర్), మహిపాల్ లోమ్‌రోర్, వానిందు హసరంగా, శబాజ్ అహ్మద్/సిద్దార్థ్ కౌల్, హర్షల్ పటేల్, జోష్ హజెల్ వుడ్, మహమ్మద్ సిరాజ్.

Story first published: Wednesday, March 23, 2022, 10:06 [IST]
Other articles published on Mar 23, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+