IPL 2022: ఆర్‌సీబీలోకి హజెల్ వుడ్, కౌల్.. చెన్నై చివరి అస్త్రం హంగార్గేకర్.. తుది జట్లు ఇవే!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు డీవై పాటిల్ వేదికగా జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జోరు మీదుండగా.. వరుసగా నాలుగు పరాజయాలతో చెన్నై చతికిలపడింది. తొలి విజయం కోసం నిరీక్షిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు వరుస విజయాలతో రెట్టించి ఉత్సాహంతో బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీ.. తమ జైత్ర యాత్రను కొనసాగించాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది.

హర్షల్ పటేల్ ఔట్..
ఈ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీకి గట్టి షాక్ తగిలింది. సొంత చెల్లలు మరణంతో ఆ జట్టు స్టార్ పేసర్, గేమ్ చేంజర్ హర్షల్ పటేల్ బయో బబుల్ వీడాడు. అతను మళ్లీ వచ్చాడా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. ఒకవేళ వచ్చినా మూడు రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఈ నేపథ్యంలోనే అతను చెన్నైతో మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు.
బౌలింగ్‌లో వేరియషన్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పే హర్షల్ లేకపోవడం ఆర్‌సీబీకీ తీవ్ర నష్టమే. ఇక ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజెల్ వుడ్ అందుబాటులోకి వచ్చాడు. అతన్ని తుది జట్టులోకి తీసుకుంటే డేవిడ్ విల్లేపై వేటు పడటం ఖాయం. హర్షల్ పటేల్ స్థానంలో సిద్దార్థ్ కౌల్ ఆడటం ఖాయం. మిగతా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

హంగార్గేకర్ చివరి అస్త్రం
దీపక్ చాహర్ గాయం చెన్నై సూపర్ కింగ్స్‌కు తీరని నష్టం చేస్తోంది. అతను హాఫ్ సీజన్ వరకు అందుబాటులో లేకపోవడంతో చెన్నై టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వడం లేదు. ఇప్పటికే తుషార్ దేశ్ పాండే, ముఖేశ్ చౌదరి, డ్వేన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణలకు అవకాశం ఇచ్చిన లాభం లేకపోయింది. చెన్నై దగ్గర చివరి అస్త్రంగా రాజవర్దన్ హంగర్గేకర్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో అతనికి చోటు దక్కవచ్చు. గత మ్యాచ్‌లో విఫలమైన మహీశ్ తీక్షణను కూడా పక్కనపెట్టే చాన్సుంది. మిగతా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

పిచ్ రిపోర్ట్..
డీవై పాటిల్ మైదానంలోని వికెట్ చేజింగ్‌కు అనుకూలం. డ్యూ ప్రభావం ఉండనుంది. స్పిన్నర్లకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో చేజింగ్ టీమ్స్ గెలిచాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గత మ్యాచ్‌ను సీఎస్‌కే ఇదే వికెట్‌పై ఆడింది. ముందుగా బ్యాటింగ్ చేసి మూల్యం చెల్లించుకుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్లు చేజింగ్‌కే మొగ్గు చూపనున్నాయి.

తుది జట్లు (అంచనా)
చెన్నై సూపర్ కింగ్స్: రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, డ్వైన్ ప్రిటోరియస్, క్రిస్ జోర్డాన్, రాజవర్థన్ హంగర్గేకర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, షెహ్‌బాజ్ అహ్మద్, డేవిడ్ విల్లే, వానిందు హసరంగా, సిద్దార్థ్ కౌల్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications