Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RCB: హమ్మయ్యా ఆ 49 పరుగులు క్రాస్ చేశారు.. ఆర్‌సీబీ చెత్త బ్యాటింగ్‌పై పేలుతున్న సెటైర్లు!

IPL 2022: RCB Gets Brutally Trolled By Fans For Putting Up Worst Performance

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో ఘోర పరాజయం చవిచూసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ.. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి 68 పరుగులకే కుప్పకూలింది. చెత్త బ్యాటింగ్‌తో చిత్తుగా ఓడి అభిమానుల ఆగ్రహానికి గురైంది. వరుస విజయాలతో ఆశలు పెంచిన ఆర్‌సీబీ ఇలా ఊహకందని రీతిలో చిత్తుగా ఓడటాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నాడు. మరీ దారుణంగా 68 పరుగులకే ఆలౌటవ్వడాన్ని సహించలేకపోతున్నారు. వరల్డ్ క్లాస్ బ్యాటర్లు, విధ్వంసక వీరులు ఉన్న ఆర్‌సీబీ ఇలా పేలవ బ్యాటింగ్‌తో ఓడిపోవడం బాలేదంటున్నారు.

కలిసిరాని ఏప్రిల్ 23..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి ఏప్రిల్ 23 ఏ మాత్రం కలిసి రావడం లేదు. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో 49 పరుగులకే కుప్పకూలిన ఆర్‌సీబీ.. మళ్లీ ఇప్పుడు 68 పరుగులకు ఆలౌటైంది. అప్పుడెప్పుడో 9 ఏళ్ల క్రితం 2013లో 263 పరుగుల భారీ స్కోర్‌ను ఏప్రిల్ 23నే నమోదు చేసింది. అప్పటి ఆర్‌సీబీ బ్యాటర్ క్రిస్ గేల్ 175 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ నేపథ్యం.. ప్రస్తుత టీమ్ ఫామ్ నేపథ్యంలో మరోసారి ఆర్‌సీబీ భారీ స్కోర్ చేస్తుందని అంతా భావించారు. కానీ 49 పరుగుల చెత్త ప్రదర్శనను రిపీట్ చేసింది. దాంతో అభిమానులు కనీసం 49 పరుగులైన క్రాస్ చేశారు. లేకుంటే ఇజ్జత్ పోయేదంటూ కామెంట్ చేస్తున్నారు.

అనూజ్ రావత్‌ను తీసేయండి..

ఈ ఘోర పరాజయంతో ఆర్‌సీబీ తుది జట్టు బలహీనత తెలుసొచ్చింది. టాపార్డర్ ఎంత బలహీనంగా ఉందో అర్థమైంది. వరుసగా విఫలమవుతున్నా.. అవకాశాలు అందుకుంటున్న యువ ప్లేయర్ అనూజ్ రావత్‌పై వేటు వేయాలని అభిమానులు సూచిస్తున్నారు. అంతేకాకుండా హసరంగాను కూడా తప్పించి లోమ్రోర్‌ను ఆడించాలని, తద్వార అలెన్, డేవిడ్ విల్లేలో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవాలంటున్నారు. ఏది ఏమైనా టీమ్ కాంబినేషన్ మాత్రం మార్చేల్సిందేనని సూచిస్తున్నారు.

కోహ్లీ గోల్డెన్ డక్...

ఇక విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ అవ్వడంపై కూడా నెటిజన్లు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఓ చాంపియన్ ప్లేయర్ ఇలా వరుసగా గోల్డెన్ డక్ అవ్వడం చూస్తుంటే చాలా కష్టంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. అతి త్వరలోనే విరాట్ తిరిగి పుంజుకుంటారని అతనికి మద్దతిస్తున్నారు. ఫామ్ టెంపరరీ, క్లాస్ పర్మినెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ వైఫల్యం తమకు భయం వేస్తుందని, కోహ్లీ కెరీర్ దగ్గరపడిందనే సూచనలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.

 చెలరేగిన అభిషేక్..

చెలరేగిన అభిషేక్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ.. 16.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. సుయాశ్ ప్రభుదేశాయ్(15), గ్లేన్ మ్యాక్స్‌వెల్(11) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. విరాట్ కోహ్లీ(0)తో పాటు అనూజ్ రావత్(0), దినేశ్ కార్తీక్(0) డకౌట్‌గా వెనుదిరిగారు. సన్‌రైజర్స్ హైదరబాద్ బౌలర్లు మార్కో జాన్సెన్(3/25), నటరాజన్(3/10) మూడేసి వికెట్లు తీయగా.. జగదీష్ సుచీత్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌లకు తలో వికెట్ దక్కింది.

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 72 పరుగులు చేసి 72 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 47) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. కేన్ విలియమ్సన్(16 నాటౌట్), రాహుల్ త్రిపాఠి(7 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Sunday, April 24, 2022, 7:42 [IST]
Other articles published on Apr 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+