
పసలేని వ్యూహాలు..
అయితే ఇంత ధర పెట్టి ఈ ముగ్గురి ఆటగాళ్లను తీసుకోవడాన్ని ఆ జట్టు ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ఏమాత్రం ఆలోచన లేకుండా తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లను తీసుకోవాలని భావించినప్పుడు వాళ్లని వేలంలోకి ఎందుకు వదిలేసారని ప్రశ్నిస్తున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ(రూ.15 కోట్లు), గ్లేన్ మ్యాక్స్‌వెల్(రూ.11 కోట్లు), మహమ్మద్ సిరాజ్(రూ.7 కోట్లు) ముగ్గురిని రిటైన్ చేసుకునేందుకు రూ.33 కోట్లు ఖర్చు చేసింది. అయితే హర్షల్ పటేల్, వానిందు హసరంగల్లో ఒకరిని రిటైన్ చేసుకునే చాన్స్ ఆర్‌సీబీకి ఉంది.

రిటైన్ చేసుకోవచ్చు కదా..?
కానీ వారిని వేలంలోకి వదిలేసి పర్స్ మనీని మిగుల్చుకున్న ఆర్‌సీబీ.. మళ్లీ వారి కోసం కోట్లు ఖర్చు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి వానిందు హసరంగా లేదా హర్షల్ పటేల్‌లను రూ. 6-9 కోట్లకు రిటైన్ చేసుకునే అవకాశం ఆర్‌సీబీకీ ఉంది. కానీ వాళ్లు ఆ అవకాశాన్ని ఉపయోగించలేదు. తీరా వారి కోసమే వేలంలో ఇతర జట్లతో పోటీ పడి భారీ ధరను చెల్లించుకున్నారు. అసలు ఆర్‌సీబీ వ్యూహాత్మకంగా ఆలోచిస్తుందా? అనే సందేహం కలుగుతోంది. మొత్తానికి తమ ఆలోచిత నిర్ణయాల వల్ల హసరంగా, హర్షల్ పటేల్‌లకు భారీ ధరతో లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ చేశారు.

లైఫ్ టైమ్ సెటిల్ మెంట్..
హసరంగాకు రూ. 10.75 కోట్ల ధర చాలా ఎక్కువ. గతేడాది అతన్ని ఆర్‌సీబీ లీగ్ మధ్యలో తీసుకోగా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇక ఈ డబ్బుతో హసరంగాకు లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ లభించింది. ఇది శ్రీలంక కరెన్సీలోకి మారిస్తే రూ.22 కోట్లతో సమానం. ఫాఫ్ డుప్లెసిస్‌ను తీసుకోవడంలో ఉన్న వ్యూహం ఏంటో కూడా అభిమానులకు అర్థం కావడం లేదు. డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ వంటి ప్లేయర్లను వదిలేసి మరీ ఫాఫ్‌ను తీసుకోవడం అభిమానులకు అర్థం కావడం లేదు.

ఆర్‌సీబీ ప్లేయర్ల జాబితా..
విరాట్ కోహ్లీ(రూ.15 కోట్లు)
గ్లేన్ మ్యాక్స్‌వెల్(రూ.11 కోట్లు)
మహమ్మద్ సిరాజ్(రూ.7 కోట్లు)
ఫాఫ్ డుప్లెసిస్(రూ.7 కోట్లు)
వానిందు హసరంగా(రూ.10.75 కోట్లు)
హర్షల్ పటేల్(రూ.10.75 కోట్లు)


Click it and Unblock the Notifications












