IPL 2022: వరుసగా మూడు వైడ్లు.. ఆకాశ్‌దీప్ చెత్త రికార్డు! పేలుతున్న మీమ్స్!

ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) యువ పేసర్ ఆకాశ్ దీప్ చెత్త రికార్డును నమోదు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 23 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆకాశ్‌దీప్ అత్యంత చెత్త ఓవర్ వేసాడు. ఒకే ఓవర్‌లో 10 బంతులు వేసాడు. నాలుగు వైడ్లు వేసిన అతను.. ఆ ఓవర్‌లో 24 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో ఈ యువ పేసర్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా 18వ ఓవర్‌ను తన చివరి ఓవర్‌గా వేసిన ఆకాశ్ దీప్.. ఊతప్ప, శివమ్ దూబే విధ్వంసకర బ్యాటింగ్‌తో తీవ్ర ఒత్తిడికిలోనయ్యాడు. అతను వేసిన తొలి బంతినే శివమ్ దూబే సిక్స్ బాదగా.. రెండో బంతిని బౌండరీ తరలించాడు. ఆ తర్వాత క్విక్ డబుల్ తీసాడు.
నాలుగో బంతిని కూడా మరో సిక్సర్ బాదడంతో ఆకాశ్ దీప్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దాంతో బౌండరీలను కట్టడి చేయాలనే ప్రయత్నంలో ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నాలుగు వైడ్లు వేసి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
ఫ్యాన్స్ ఫైర్..
ఓవరాల్‌గా 4 ఓవర్లలో 58 పరుగులిచ్చిన ఆకాశ్ దీప్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో ఆకాశ్ దీప్‌పై ఫ్యాన్స్ మండిపడ్డారు.'ఒక ఓవర్‌లో ఆరు బంతులు ఉంటాయన్న సంగతి మరిచిపోయినట్లున్నాడు.. మరో రెండు బంతులు వేసుంటే.. రెండు ఓవర్లను ఒకే ఓవర్‌లో వేసిన బౌలర్‌గా చరిత్రకెక్కేవాడు.. మిస్ చేసుకున్నావు'' అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఈ ఓవర్‌తో ఆకాశ్ దీప్ ఎక్స్‌పెన్సివ్ బౌలర్ల అకాడమీలో చోటు సంపాదించుకున్నాడని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

చెన్నైకి తొలి విజయం..
ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. శివమ్ దూబె ( 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 నాటౌట్), రాబిన్ ఉతప్ప ( 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 88) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. అనంతరం బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసింది.
షాబాజ్ అహ్మద్( 27 బంతుల్లో 4 ఫోర్లతో 41), సూయాశ్ ప్రభుదేశాయ్ ( 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34), దినేశ్ కార్తీక్ ( 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) రాణించారు. ఛేదనలో చకచకా నాలుగు వికెట్లు పడ్డా బెంగళూరు పోరాడింది. తీక్షణ (4/33), జడేజా (3/39) బెంగళూరును దెబ్బతీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications