IPL 2022: విరాట్ కోహ్లీ ఆ షాట్ ఆడాలంటూ రవిశాస్త్రి అడ్వైజ్!

ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సలహా ఇచ్చాడు. స్పిన్ బౌలింగ్‌లో తడబడుతున్న విరాట్ కోహ్లీ ఆ సమస్యను అధిగమించాలంటే స్వీప్ షాట్లు ఆడటంపై ఫోకస్ పెట్టాలన్నాడు. ఈ షాట్‌ను స్వేచ్చగా ఆడితే విరాట్ కోహ్లీకి తిరుగుండదని చెప్పాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ఫుట్ వర్క్‌ను ఉపయోగించుకుంటూ కోహ్లీ స్వీప్ షాట్లు ఆడాడని చెప్పాడు. ప్రస్తుతం హిందీ కామెంటేటర్‌గా పనిచేస్తున్న రవిశాస్త్రి.. స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ మ్యాచ్ షోలో విరాట్ బ్యాటింగ్ తీరును విశ్లేషించాడు.

స్వీప్ షాట్ ఆడాలి...
'విరాట్ కోహ్లీలో నాకు నచ్చే అంశం పోరాట పటిమ. ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధించేందుకు ఎప్పుడూ కష్టపడుతుంటాడు. స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు తన ఫుట్‌వర్క్‌ను వినియోగించుకునేందుకు సన్నద్ధమయ్యాడు. అందుకే పంజాబ్‌తో మ్యాచ్‌లో స్వీప్ షాట్లను కొట్టగలిగాడు. ఇది చాలా ముఖ్యమైన షాట్. అయితే, కోహ్లీ ఎక్కువగా దానిని ఆడడు. అందుకే చెబుతున్నా ఇలాంటి షాట్లను స్వేచ్ఛగా ఆడితేనే పరుగులు వస్తాయి.

నెట్స్‌లో ప్రాక్టీస్ చేయాలి..
నెట్స్‌లో ఫాస్ట్ బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేయడం కన్నా స్పిన్‌పై దృష్టిపెట్టాలి. స్పిన్నర్‌తో ఎక్కువగా బౌలింగ్ వేయించుకుని స్వీప్ షాట్లను ఆడేందుకు ప్రయత్నించాలి. ఒక్కసారి స్వీప్ షాట్లను ఆడేందుకు బ్యాటర్ ప్రయత్నిస్తే బౌలింగ్ చేసేందుకు స్పిన్నర్ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు'' అని రవిశాస్త్రి వివరించాడు. పంజాబ్‌తో జరిగిన ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ 29 బంతుల్లో 41 పరుగులతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయితే కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం విఫలమయ్యాడు.

కోహ్లీ విఫలమైనా...
కోహ్లీ విఫలమైనా ఆర్‌సీబీ అద్భుత విజయాన్నందుకుంది. సమష్టిగా రాణించి మూడు వికెట్లతో గెలుపొంది ఐపీఎల్ 2022 సీజన్‌లో బోణీ కొట్టింది. ఇక టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రవిశాస్త్రి మార్గదర్శకంలోనే కెప్టెన్‌గా కోహ్లీ విదేశాల్లో ఎన్నో అపూర్వ విజయాలను నమోదు చేశాడు. శాస్త్రి హెడ్ కోచ్ పదవి బాధ్యతలు ముగించిన వెంటనే కోహ్లీ తన సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications