IPL 2022: కెప్టెన్‌పై అసభ్యకర ట్వీట్.. రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా టీమ్‌పై వేటు!

ముంబై: ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు చెందిన సోషల్ మీడియా టీమ్ చాలా చురుకుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆ జట్టు మైదానంలో పెద్దగా రాణించకున్నా.. సోషల్ మీడియా వేదికగా తమ ఫన్నీ ట్వీట్స్‌తో అభిమానులను అలరిస్తుంటుంది. ఒక్కోసారి తమ టీమ్ ఆటను కూడా ట్రోల్ చేస్తుంటుంది. విభిన్నమైన ట్వీట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా అడ్మిన్‌కు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా అతను షేర్ చేసే ఫన్నీ మీమ్స్, సెటైర్స్ కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తాయి. కానీ ఆ అత్యుహమే ఇప్పుడు అతనికి చేటు చేసింది. సరదాగా పెట్టిన ఓ పోస్ట్ అతని ఉద్యోగం పోయేలా చేసింది.
అసలేం జరిగిందంటే..?
తమ కెప్టెన్ ఫొటోతో రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్ సరదాగా ఓ పోస్ట్ చేయగా.. దానిపై సంజూ శాంసన్ సీరియస్ అయ్యాడు. సంజూ శాంసన్ పాత ఫోటోను తీసుకొని దానికి కూలింగ్ గ్లాసెస్, రాజస్తాన్ రాయల్స్ సంప్రదాయ తలపాగాను చుట్టి.. చెవులకు కమ్మలు పెట్టి ఎడిట్ చేశాడు. దానికి'మీరు ఎలా ఉన్నారో'చూసుకోండి అంటూ సంజూ శాంసన్‌కు ట్యాగ్ చేశాడు. అయితే ఈ ఫోటోపై శాంసన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. మనం ఏమన్నా స్నేహితులా? అంటూ మండిపడ్డాడు. అంతటితో ఆగకుండా రాజస్థాన్ రాయల్స్ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌ను అన్‌ఫాలో చేశాడు.

ప్రొఫెషనల్‌గా ఉండాలి..
'మన ఫ్రెండ్స్ అయితే ఇలాంటివి చేసినా ఏం అనిపించదు. కానీ ఐపీఎల్ లాంటి లీగ్‌లో ఉన్న ఒక జట్టు సోషల్ మీడియా టీం ఇలా చేయడం కరెక్ట్ కాదు. కాస్త ప్రొఫెషనల్స్‌లా నడుచుకుంటే బాగుంటుంది'అని ట్వీట్ చేశాడు. అంతేకాదు తనపై ట్వీట్ పెట్టినందుకు సదరు సోషల్ మీడియా టీమ్‌పై రాజస్తాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్‌కు సంజూ శాంసన్ ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాజస్థాన్ రాయల్స్ టీమ్ సదరు అడ్మిన్‌పై చర్యలు తీసుకుంది.
మా స్ట్రాటజీ మారుస్తాం..
ట్విటర్ వేదికగా ఈ ఘటనపై రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ స్పందించింది. సోషల్ మీడియా వ్యూహాలపై పున సమీక్ష చేస్తామని, సోషల్ మీడియా టీమ్‌ను కూడా మార్చేస్తున్నామని పేర్కొంది. జట్టులోని ఆటగాళ్లంతా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు సిద్దమవుతున్నారని తెలిపింది. అతి త్వరలోనే కొత్త సోషల్ మీడియా టీమ్‌ను అపాయింట్ చేస్తామని పేర్కొంది. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో రెగ్యులర్ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తారనే విషయం తెలుసని, తాత్కలిక పరిష్కారం కనుగొంటామని తెలిపింది.
సంజూపై ఫ్యాన్స్ ఫైర్..
సరదాగా చేసిన ట్వీట్‌కు ఇంత సీరియస్ కావాల్సిన అవసరం లేదంటూ నెటిజన్లు సంజూ శాంసన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్, ధోనీ, రోహిత్ శర్మలపై కూడా ఇలాంటి ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేశారని, వాళ్లంతా సరదాగా తీసుకున్నారని కామెంట్ చేస్తున్నారు. సంజూ శాంసన్ కంటే ఎక్కువ మంది రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్‌కు ఫ్యాన్స్ ఉన్నారని మండిపడుతున్నారు. ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టడం మానేసి ఆటపై దృష్టిసారించాలని చురకలంటిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications