IPL 2022: చెలరేగిన తెవాటియా.. చేతులెత్తేసిన ఆర్‌సీబీ! టాప్ లేపిన గుజరాత్!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వైఫల్యం కొనసాగుతోంది. ఆరంభంలో వరుస విజయాలతో దుమ్మురేపిన ఆర్‌సీబీ.. రెండో దశ లీగ్‌లో దారుణంగా విఫలమవుతోంది. పేలవ బ్యాటింగ్, బౌలింగ్‌తో వరుసగా హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసింది. గుజరాత్ టైటాన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చినా ఆర్‌సీబీకి కలిసిరాలేదు.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 58), రజత్ పటిదార్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రదీప్ సంగ్వాన్ 2 వికెట్లు తీయగా.. షమీ, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్, ఫెర్గూసన్ తలో వికెట్ తీసారు.

తెవాటియా మెరుపులు..
అనంతరం లక్ష్యచేధరకు దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. మరో రాహుల్ తెవాటియా(25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43) మెరుపులు మెరిపించగా.. డేవిడ్ మిల్లర్(24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39), శుభ్‌మన్ గిల్(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో హసరంగా, షెహ్‌బాజ్ అహ్మద్ రెండేసి వికెట్లు తీసారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో తమ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

రాణించిన ఓపెనర్లు..
171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు వృద్దిమాన్ సాహా(29), శుభ్‌మన్ గిల్(31) శుభారంభం అందించారు. ఆరంభం నుంచి ఆర్‌సీబీ బౌలర్లపై ఈ జోడీ ఎదురు దాడికి దిగడంతో వేగంగా పరుగులొచ్చాయి. దాంతో గుజరాత్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. ఆ వెంటనే ఫాఫ్ డుప్లెసిస్.. హసరంగాను బరిలోకి దించి ఫలితాన్ని రాబట్టాడు. సాహాను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన హసరంగా.. 51 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీసాడు.

స్పిన్నర్లు చెలరేగినా..
ఆ వెంటనే జోరు మీదున్న శుభ్‌మన్ గిల్‌ను షెహ్‌బాజ్ వికెట్లు ముందు బోల్తా కొట్టించాడు. ఈ పరిస్థితుల్లో హార్దిక్, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసిన షెహ్‌బాజ్ తన మరుసటి ఓవర్‌లోనే హార్దిక్ పాండ్యా(3)ను పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే సాయి సుదర్శన్‌ను హసరంగా ఔట్ చేయడంతో గుజరాత్ నాలుగు వికెట్లు కోల్పోయింది.

మిల్లర్, తెవాటియా..
క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రివ్యూ ద్వారా ఫలితాన్నిరాబట్టాడు. మిల్లర్‌తో కలిసి అతను ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడుతూ లక్ష్యాన్ని సులువు చేశారు. హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్‌లో 12 పరుగులు రాబట్టిన ఈ జోడీ.. హజెల్ వుడ్ వేసిన చివరి ఓవర్‌లో రెండు బౌండరీలు బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications