క్వింటన్ డికాక్-కేఎల్ రాహుల్ విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఓపెనింగ్ జోడీగా...

ముంబై: లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన ఈ ఓపెనింగ్ జోడీ.. 15 ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన జోడీగా చరిత్రకెక్కారు. అంతేకాకుండా 20 ఓవర్లు పాటు ఆడిన తొలి ఓపెనింగ్ జోడీగా కూడా తమ పేరిట రికార్డు లిఖించుకున్నారు.
ఈ మ్యాచ్‌లో క్వింటన్ డికాక్(70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140 నాటౌట్) భారీ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం కేకేఆర్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులే చేయడంతో 2 పరుగులతో తేడాతో గెలిచిన లక్నో ప్లే ఆఫ్స్ బెర్త దక్కించుకుంది. ఇక అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగిన రాహుల్-డికాక్ పలు రికార్డులను బద్దలు కొట్టారు.

అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం..
ఈ మ్యాచ్ ద్వారా రాహుల్-డికాక్ 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని(210) అందించిన జోడీగా చరిత్రకెక్కింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఓపెనర్లు జానీ బెయిర్ స్టో-డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. 2019లో ఈ జోడీ తొలి వికెట్‌కు 185 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అంతకుముందు 2017 సీజన్‌లో కేకేఆర్ ఓపెనర్లు గౌతం గంభీర్-క్రిస్ లిన్‌లు తొలి వికెట్‌కు 184 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

ఐపీఎల్ చరిత్రలో తొలి జోడీగా..
ఐపీఎల్ చరిత్రలోనే 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉన్న ఏకైక ఓపెనింగ్ జోడీగా డికాక్-రాహుల్ చరిత్ర సృష్టించారు. లీగ్ చరిత్రలో ఏ జోడీ కూడా మొత్తం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయలేదు. కేకేఆర్ జట్టుపై కూడా ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం. 2017లో సన్‌రైజర్స్ తరఫున డేవిడ్ వార్నర్-శిఖర్ ధావన్‌లు తొలి వికెట్‌కు 139 పరుగులు జతచేశారు. ఐపీఎల్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇది మూడో అత్యుత్తమ భాగస్వామ్యం.. విరాట్ కోహ్లీ-డివిలియర్స్ ఆర్‌సీబీ తరఫున 2016లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 229 పరగుల భాగస్వామ్యాన్ని అందించారు.
ఇప్పటికీ ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. రెండో స్థానంలో కూడా ఈ జోడీనే ఉంది. 2015లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, డివిలియర్స్ 215 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

రాహుల్ వరుసగా ఐదోసారి..
కేఎల్ రాహుల్ తాజా సీజన్‌లో ఇప్పటికే 14 మ్యాచ్‌లాడి 135.26 స్ట్రైక్‌రేట్‌తో 537 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. రాహుల్ ఇలా ఒకే సీజన్‌లో 500 పైచిలుకు స్కోరు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. ఐపీఎల్ 2018 సీజన్ నుంచి వరుసగా ఐదు సీజన్లలోనూ అతను 500+ స్కోరు చేస్తూనే ఉన్నాడు.
2018లో 659, 2019లో 593, 2020లో 670 (ఆరెంజ్ క్యాప్), 2021లో 626, 2022లో 537* పరుగులు చేశాడు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఈ 15 ఏళ్లలో ఇలా వరుసగా ఐదు సీజన్లలో 500పైచిలుకు స్కోరు చేసిన రెండో ప్లేయర్‌గా శిఖర్ ధావన్ సరసన కేఎల్ రాహుల్ నిలిచాడు. 6 సార్లు 500 పైచిలుకు పరుగులతో డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

ఐపీఎల్‌లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు..
- క్రిస్ గేల్ (175 నాటౌట్) ఆర్సీబీ వర్సెస్ పూణే (2013)
- బ్రెండన్ మెక్ కల్లమ్ (158 నాటౌట్) కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ (2008)
- క్వింటన్ డికాక్ (140 నాటౌట్) లక్నో వర్సెస్ కేకేఆర్ (2022)
- ఏబీ డివిలియర్స్ (133 నాటౌట్) ఆర్సీబీ వర్సెస్ ముంబై (2015)
- కేఎల్ రాహుల్ (132 నాటౌట్) పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ (2020)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications