
సన్‌రైజర్స్ సెకండ్..
ఆ తర్వాత సీజన్‌ను ఓటమితో ప్రారంభించి అద్భుత విజయాలతో దూసుకొచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉంది. 7 మ్యాచ్‌ల్లో వరుసగా ఐదు గెలిచిన కేన్ సేన.. ఆర్‌సీబీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లతో భారీ విజయాన్నందుకొని మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఇక మూడో స్థానంలో5 విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ కొనసాగుతోంది. పేలవ బ్యాటింగ్‌తో హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ ఐదు విజయాలతో రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. 4 విజయాలతో లక్నో సూపర్ జెయింట్స్ ఐదో స్థానంలో ఉండగా.. మూడేసి విజయాలతో ఢిల్లీ, కేకేఆర్, పంజాబ్, 6,7,8 స్థానాల్లో కొనసాగుతున్నాయి. రెండు విజయాలతో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై 9వ స్థానంలో ఉండగా.. ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా నమోదు చేయని ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో నిలిచింది.

ప్లే ఆఫ్స్ నుంచి ముంబై ఔట్..
ఏడింటికి ఏడు గెలిచిన ముంబై ఇండియన్స్ 99.9 శాతం ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లే. ఎందుకంటే ఆ జట్టు మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో ఏడు గెలిచినా టాప్-4లో నిలవలేదు. చెన్నై సూపర్ కింగ్స్‌కు కొంత అవకాశం ఉన్నప్పటికీ.. మిగిలిన 7 మ్యాచ్‌లకు ఏడు మ్యాచ్‌లు గెలవడం కష్టం. ఈ సారి 10 జట్లు రేసులో ఉండటంతో కనీసం ఒక్కో జట్టు 9 మ్యాచ్‌లను గెలవడంతో పాటు మెరుగైన రన్‌రేట్ సాధించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నై మిగిలిన ఏడింటికి ఏడు మ్యాచ్‌లు గెలవడం అసాధ్యమే. పంజాబ్ కింగ్స్ సైతం ఏడింటిలో 6 గెలవాలి. సంచలన ప్రదర్శన చేస్తే తప్పా ఇది సాధ్యమయ్యే అవకాశాలు లేవు.

లక్నోకు చాన్స్..
కోల్‌కతా నైట్‌రైడర్స్ సైతం మిగిలిన 6 మ్యాచ్‌ల్లో 6 గెలవాలి. అప్పుడే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. 5 గెలిచినా 16 పాయింట్లతో పాటు మెరుగైన రన్ రేట్ ఉంటే సాధ్యమవుతోంది. కాబట్టి కేకేఆర్‌కు కూడా పెద్దగా అవకాశం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ సైతం ఏడింటిలో ఆరు గెలవాలి. ప్రస్తుతం ఆ జట్టు కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. టాపార్డర్ మినహా లోయరార్డర్, మిడిలార్డర్ బలహీనంగా ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌కు మాత్రం అవకాశాలున్నాయి. మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఐదు గెలిచినా సరిపోతుంది.

ఈ నాలుగు టీమ్స్ ప్లే ఆఫ్స్ పక్కా..
టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరడం ఖాయం. మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌కు డోకా ఉండదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం ఏడింటిలో నాలుగు గెలిచినా సరిపోతుంది. పైగా ఈ రెండు జట్లు ఏ ఒక్కరి ప్రదర్శన మీదనో ఆధారపడటం లేదు. సమష్టిగా రాణిస్తూ విజయాలందుకుంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రతీ మ్యాచ్‌లో ఇరు జట్లలోని ఒక్కో ఆటగాడు రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ సైతం మరో నాలుగు గెలిస్తే సరిపోతుంది. ఆ జట్టులో జోస్ బట్లర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు.
సంజూ సూపర్ కెప్టెన్సీతో రాణిస్తున్నాడు. ఇక నిన్నటి వరకు అత్యంత బలంగా కనిపించిన ఆర్‌సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంతో బలహీనంగా మారింది. ఈ ఓటమితో ఆ జట్టు రన్ రేట్ దారుణంగా పడిపోయింది. దాంతో రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఇదే వైఫల్యం కొనసాగితే ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే. కానీ ఇప్పటి వరకు రాణించినట్లు రాణిస్తే మాత్రం తిరుగుండదు.

ప్లే ఆఫ్స్ (అంచనా)
1. గుజరాత్ టైటాన్స్
2. సన్‌రైజర్స్ హైదరాబాద్
3. రాజస్థాన్ రాయల్స్
4. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు


Click it and Unblock the Notifications
