IPL 2022: ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన సన్‌రైజర్స్.. ట్వీట్స్ అన్నీ తెలుగులోనే!

హైదరాబాద్: చెత్తాటతో గత సీజన్‌లో చివరి స్థానం.. తన ఆటతో ఫ్రాంచైజీకే వన్నె తెచ్చి టైటిల్ అందించిన సారథి డేవిడ్ వార్నర్‌ను అవమానకర రీతిలో తప్పించడం.. జానీ బెయిర్ స్టో, రషీద్ ఖాన్, జాసన్ హోల్డర్ లాంటి టాప్ ప్లేయర్లను వదులుకోవడం.. వేలంలో స్టార్లను కాదని అభిషేక్ శర్మ (6.50 కోట్లు) లాంటి అనామక ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించడం.. మరోసారి బ్యాటింగ్‌పై ఫోకస్ చేయలేదన్న విమర్శలు.. ఇన్ని ప్రతికూలతల నడుమ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్2022 సీజన్‌కు రెడీ అవుతోంది. వేలంలో తమ అంచనాలను అందుకోలేదని టీమ్‌మేనేజ్‌మెంట్‌పై అభిమానులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
తెలుగులో ట్వీట్స్.
.
జట్టులో ఒక్క తెలుగు ఆటగాడిని తీసుకోకపోగా.. తెలుగు భాషకు పెద్దగా ప్రాధన్యత ఇవ్వకపోవడంపట్ల అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. తమ చేష్టలన్నీ చెన్నై బీ టీమ్‌గా ఉండటంతో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా దుమ్ముత్తిపోసారు. ఇక అభిమానుల మనోభావాలను అర్థం చేసుకున్న మేనేజ్‌మెంట్ ఎట్టకేలకు దిగొచ్చింది. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తూ తమ సోషల్ మీడియా పోస్ట్‌లన్నిటినీ తెలుగులోనే పెడుతుంది. కేన్ విలియమ్సన్ జట్టులో చేరాడనే విషయం నుంచి తాజాగా వాషింగ్టన్ సుందర్‌కు సంబంధించిన అప్‌డేట్ వరకు తెలుగులోనే ట్వీట్ చేసింది. హోళీ శుభాకాంక్షలను కూడా తెలుగులోనే చెప్పింది. దాంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.
సుందరం సినిమాను ఉద్దేశిస్తూ..
వాషింగ్టన్ సుందర్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడనే విషయాన్ని సన్‌రైజర్స్ అడ్మిన్ తనదైన శైలిలో చెప్పాడు. టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని అప్‌కమింగ్ మూవీ సుందరం రిలీజ్ డేట్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. 'ఆ సుందరం జూన్‌లో వస్తాడు.. ఈ సుందరం ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు'అని వాషింగ్టన్ సుందర్ ప్రాక్టీస్ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. తెలుగులో ట్వీట్ చేయడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా మందికి నాని అప్‌కమింగ్ మూవీ గురించి తెలియకపోవడంతో ఈ ట్వీట్‌ను అర్థం చేసుకోలేకపోయారు. అయితే తెలుగులో ట్వీట్ చేయడాన్ని మాత్రం ఆహ్వానించారు.
సుందర్ సైతం తెలుగులోనే..
మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో నాని కామెడీ రోల్ చేయనున్నాడని, జూన్10 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ అడ్మిన్ ఆ సుందర్ జూన్‌లో వస్తున్నాడని క్యాప్షన్ ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ సైతం ఈ ట్వీట్‌ను అర్థం చేసుకోలేక.. అప్పుడే వచ్చాను కదా అని కామెంట్ చేశాడు. కామెంట్ కూడా తెలుగులో చేయడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. సుందర్ కొనియాడుతూ ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు. మరికొందరు మాత్రం సెటైరికల్‌గా పోస్ట్‌లు పెడుతున్నారు. ఆర్‌సీబీ అభిమానులు మాత్రం నిన్ను మిస్సయ్యాం బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సన్‌రైజర్స్ చేసిన తెలుగు ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications