సురేశ్ రైనా లేకపోవడంతోనే..
ఇక డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన చెన్నై.. చెత్తాటతో వరుసగా (కోల్‌కతా, లక్నో, పంజాబ్) మూడు మ్యాచ్‌ల్లోను ఓటమిపాలైంది. ముఖ్యంగా ఆ జట్టుకు ఏదీ కలిసిరావడం లేదు. బ్యాటింగ్‌లో రాణిస్తే.. బౌలింగ్‌లో.. బౌలింగ్‌లో చెలరేగితే బ్యాటింగ్‌లో విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఆ జట్టు పేలవ ఫీల్డింగ్... టీమ్ విజయవకాశాలను దెబ్బతీస్తోంది. జడేజా అనుభవలేమి కెప్టెన్సీ జట్టుకు నష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే చెన్నై అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సురేశ్ రైనా లేకపోవడం వల్లే చెన్నైకి ఈ గతి పట్టిందంటున్నారు. రైనా లేని 2020 సీజన్‌లో చెన్నై ఇలాంటి చెత్త ప్రదర్శనే కనబర్చిందని గుర్తు చేస్తున్నారు. రైనా వచ్చాక గతేడాది టైటిల్ కొట్టిందని, ఈ సారి అతన్ని తీసుకోకపోవడంతో మళ్లీ అదే గతి పట్టిందని కామెంట్ చేస్తున్నారు.
టీవీ ఎత్తిపడేసంత కోపం..
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ చూస్తుంటే టీవీని ఎత్తిపడేయాల్సినంత కోపం వచ్చిందనే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ముందుగా బౌలింగ్‌లో విఫలమైన చెన్నై.. ఆ తర్వాత 181 పరుగుల భారీ లక్ష్య చేధనలో 36 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఔటాఫ్ సిలబస్‌లా దూసుకొచ్చిన వైభవ్ అరోరా ఆరంభంలోనే చెన్నైని దెబ్బతీసాడు. ఫామ్‌లో ఉన్న రాబిన్ ఊతపప్ప(13), మోయిన్ అలీ(0)ను ఔట్ చేసి చెన్నై పతనాన్ని శాసించాడు. దాంతో చెన్నై అభిమానులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
తలెత్తుకోలేకపోతున్నాం..
ప్రతీ టీమ్‌కు రెండు పాయింట్స్ ఇవ్వడమే చెన్నై టీమ్ లక్ష్యమని మరో అభిమాని సెటైర్లు పేల్చాడు. ఈ పేలవ ప్రదర్శనను అస్సలు తట్టుకోలేకపోతున్నామని, ఇతర జట్ల అభిమానుల ముందు తలెత్తుకోలేకపోతున్నామని మండిపడుతున్నారు. ఫన్నీ మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇంత చెత్త ఆటగాళ్లను ఎందుకు తీసుకున్నారు? అంటూ మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. జడేజాకు కెప్టెన్సీ ఇవ్వాల్సింది కాదని మరికొందరూ అభిప్రాయపడుతుండగా.. ఈ ప్రదర్శనను అంచనా వేసే ధోనీ సైడయ్యాడని ఇంకొందరూ కామెంట్ చేస్తున్నారు.
పంజాబ్ చేతిలో చిత్తుగా..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 180 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్(32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 60) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. అతనికి తోడుగా శిఖర్ ధావన్(33), జితేశ్ శర్మ(26) రాణించారు. చెన్నై బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్, క్రిస్ జోర్డాన్ రెండేసి వికెట్లు తీయగా.. ముఖేశ్ చౌదరి, డ్వేన్ బ్రావో, జడేజా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. 18 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. శివమ్ దూబే(57) మినహా అంతా విఫలమయ్యారు.


Click it and Unblock the Notifications
