Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs KKR థ్రిల్లింగ్ మ్యాచ్‌లో మెరిసిన ఈ బ్యూటీ ఎవరు?

IPL 2022: Mystery Girl Steals Show During KKR vs LSG

ముంబై: వాట్‌ ఎ మ్యాచ్‌.. బ్యాటర్ల విధ్వంసంతో బౌండరీల వర్షం కురిసింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగి అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజాను అందించింది. లీగ్ ఆసాంతం చప్పటి మ్యాచ్‌లతో నిరాశకు గురైన అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి ఓవర్‌లో ఏకంగా సినిమాను మించిన హైడ్రామాచోటు చేసుకోగా.. ఈ పరిస్థితుల్లో టెన్షన్ పడుతూ ఓ బ్యూటీ టీవీ కెమెరాల్లో తళుక్కుమంది. అంతే ఆమె కోసం నెటిజన్లు వెతకడం మొదలు పెట్టారు. సినీ హీరోయిన్‌లా ఉన్న ఆమె అందానికి దాసోహం అయ్యారు. ఉత్కంఠకే ఊపిరి సడలని మ్యాచ్‌లో అమయాకంగా పెట్టిన ఆమె ఎక్స్‌ప్రెషన్‌కు ఫిదా అయ్యారు. 25 సెకండ్ల పాటు కనిపించిన ఈ బ్యూటీ యావత్ దేశ దృష్టిని ఆకర్షించింది.

వెంటనే ఆమె వివరాలు తెలుసుకోవడానికి అభిమానులు ట్విటర్‌ను ఆశ్రయించారు. కానీ ఆమె అసలు పేరు తెలుసుకోలేకపోయారు. కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సదరు మిస్టరీ గర్ల్ అభిమానుల మనుసులను దోచేసింది. తన అందంతో ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కాగా ఇంతకముందు కూడా ఇదే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌లో ఒక యువతి ఫోటోలు వైరల్‌గా మారాయి. మొదట ఆ అమ్మాయి ఎవరో తెలియకపోయినా.. తర్వాత.. ఆమె పేరు ఆర్తి బేడీ అని డ్యాన్సర్‌ అని తెలిసింది. కాగా ఆ మ్యాచ్ తర్వాత ఆర్తి బేడీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

మ్యాచ్ విషయానికి వస్తే.. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్ 2 పరుగులతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. కేకేఆర్ ఇంటిదారిపట్టింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్వింటన్ డికాక్(70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140 నాటౌట్) భారీ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. నితీశ్ రాణా(22 బంతుల్లో 9 ఫోర్లతో 42), సామ్ బిల్లింగ్స్ (24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), రింకూ సింగ్(15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40) ధాటిగా ఆడారు. లక్నో బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్, మార్కస్ స్టోయినీస్ మూడేసి వికెట్లు తీయగా.. కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Thursday, May 19, 2022, 17:44 [IST]
Other articles published on May 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+