Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉమ్రాన్ మాలిక్‌ను జాగ్రత్తగా వాడుకోవాలి.. లేకుంటే పనికిరాకుండా పోతాడు: మాజీ పేసర్

IPL 2022: Munaf Patel says If you use Umran Malik too much, he will cut down pace

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో దుమ్మురేపుతున్న సర్‌రైజర్స్ హైదరాబాద్‌ యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా భవిష్యత్తు బౌలర్ అతనంటూ దిగ్గజ క్రికెటర్లు కొనియాడుతున్నాయి. అయితే ఉమ్రాన్ మాలిక్‌ను జాగ్రత్తగా వాడుకోవాలని, ఎక్కువగా ఉపయోగించుకుంటే గాయాలబారిన పడతాడని టీమిండియా మాజీ పేసర్‌ మునాఫ్‌ పటేల్‌ అభిప్రాయపడ్డాడు. మాలిక్ గాయాల బారిన పడితే పేస్‌ను మార్చుకోవాల్సి వస్తుందన్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఉమ్రాన్‌ నిలకడగా బౌలింగ్‌ చేస్తూ 150కిమీ వేగంతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు.

గొప్ప విషయం..

గొప్ప విషయం..

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల ఘనతను అందుకొని టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఉమ్రాన్‌ బౌలింగ్‌పై స్పందించిన మునాఫ్‌ టీమిండియా సెలెక్టర్లకు కీలక సూచనలు చేశాడు. 'ఉమ్రాన్‌ మాలిక్ బౌలింగ్‌ చేయడానికి పరుగెత్తుతుంటే నేను కూడా బౌలింగ్‌ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఐపీఎల్ ద్వారా ఇలాంటి నైపుణ్యమున్న ఆటగాళ్లు వెలుగులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా సరైన వసతులు లేని గ్రామీణ ప్రాంతాల ఆటగాళ్లు ఈ టోర్నీ ద్వారా వెలుగు చూడటం మంచి విషయం.

వెంటనే టీమిండియాకు సెలెక్ట్ చేయాలి..

వెంటనే టీమిండియాకు సెలెక్ట్ చేయాలి..

లేకపోతే మాలిక్ ఎక్కడ ఆడేవాడో ఎవరికి తెలుసు. ఇప్పుడైతే ఈ సీజన్‌లో అత్యధిక వేగంగా బంతులేస్తున్న బౌలర్‌గా నిలిచాడు. ఇక బీసీసీఐ అతన్ని జాతీయ జట్టుకు ఎంపిక చేయడానికి ఆలస్యం ఏమాత్రం చేయవద్దు. తొలుత దేశవాళీ క్రికెట్‌లో అవకాశాలిచ్చి తర్వాత టీమిండియాకు తీసుకురావాలనే ఆలోచనను పక్కనపెట్టాలి. ఇప్పటి నుంచే భారత జట్టుతో కలిసి పంపాలి. దాంతో అతను అంతర్జాతీయ పరిస్థితులకు త్వరగా అలవాటు పడతాడు.

ఫాస్ట్ బౌలర్లకు కొత్త రూల్..

ఫాస్ట్ బౌలర్లకు కొత్త రూల్..

అలాగే ఫాస్ట్‌బౌలర్లు ఏడాదికి ఇన్ని మ్యాచ్‌లే ఆడాలనే కచ్చితమైన నిబంధన తీసుకురావాలి. తద్వారా ఆటగాళ్లు గాయాలబారిన పడకుండా ఉంటారు. ఇప్పుడు టెక్నాలజీ, ట్రైయినింగ్‌, ఫిజియోథెరపీ సదుపాయాలు మెరుగైనా ఉమ్రాన్‌ మాలిక్‌ లాంటి ఆటగాడిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ అతనితో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిస్తే.. గాయాలబారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాంతో ఉమ్రాన్‌ తన పేస్‌బౌలింగ్‌లో మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు'అని మునాఫ్‌ చెప్పుకొచ్చాడు.

పర్పుల్ క్యాప్ రేసులో..

పర్పుల్ క్యాప్ రేసులో..

ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15వికెట్లు తీశాడు. పర్పుల్ క్యాప్ రేసులో యుజ్వేంద్ర చాహల్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. నటరాజన్ సైతం 15వికెట్లతో ఉమ్రాన్‌తో సమానంగా ఉన్నా ఎకానమీ ఉమ్రాన్‌దే బెటర్‌గా ఉంది. నిన్నటి మ్యాచ్‌లో 4ఓవర్లలో 5వికెట్లు తీసిన మాలిక్ 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో బెస్ట్ ఎకానమీతో పలు రికార్డులను నమోదు చేసుకున్నాడు.ఈ సీజన్‌లో 5 వికెట్ల ఘనతను అందుకున్న తొలి పేసర్‌గా నిలిచాడు.

Story first published: Friday, April 29, 2022, 17:49 [IST]
Other articles published on Apr 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+