Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ సర్ ఎప్పుడూ చెప్పేది అదొక్కటే: సీఎస్‌కే యువ పేసర్

IPL 2022: Mukesh Choudhary says grateful I am playing under MS Dhonis leadership

ముంబై: ఒత్తిడికి గురికావద్దని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనకు ఎప్పుడూ సూచిస్తుంటాడని ఆ జట్టు యువ పేసర్ ముఖేశ్ చౌదరి తెలిపాడు. ఒత్తిడికి లోనవ్వకుండా, పరుగులు ఇవ్వకుండా బౌలింగ్ చేస్తే వికెట్లు వాటంతటే అవే వస్తాయని ధోనీ సర్ ఎప్పుడూ చెబుతుంటాడని చౌదరి పేర్కొన్నాడు. దీపక్ చాహర్ గైర్హాజరీ నేపథ్యంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న ముఖేశ్ చౌదరి ఆరంభంలో విఫలమైనా ఆ తర్వాత లయ అందుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన చౌదరి.. ఫస్ట్ మ్యాచ్‌లో విఫలమైనా తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో 4 వికెట్ల పడగొట్టాడు. ఇక ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ముంబైపై చెలరేగడంతో..

ముంబైపై చెలరేగడంతో..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లోను ఈ యువ పేసర్ సత్తా చాటాడు. గతేడాది చెన్నైకి నెట్ బౌలర్‌గా సేవలందించిన ముఖేశ్‌ను ఈ సారి వేలంలో చెన్నై రూ.20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ మార్గదర్శంలో మ్యాచ్ మ్యాచ్‌కు రాటు దేలుతున్న చౌదరి.. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చి ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ధోనీ సర్ నాయకత్వంలో ఆడే అవకాశం దక్కడం గొప్పగా భావిస్తున్నానని చెప్పాడు.

అలా చేస్తే..

అలా చేస్తే..

'ధోనీ సర్ గైడెన్స్ నాకు చాలా ఉపయోగపడుతోంది. నేను పవర్ ప్లేలో కట్టడిగా బౌలింగ్ చేసి వికెట్లు తీస్తున్నానంటే దానికి కారణం ధోనీ సర్. బ్యాట్స‌మన్ పరుగులు చేయకుండా నేను బంతిని స్వింగ్ చేస్తున్నాను. దాంతో ఒత్తిడికి గురవుతున్న బ్యాటర్లు పరుగులు చేయాలనే ఆతృతలో వికెట్ పారేసుకుంటున్నారు. డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేసేందుకు సన్నదం కావాలని ధోనీ సర్ చెప్పాడు. పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న నువ్వు.. స్లాగ్ ఓవర్లలో కూడా అలా రాణించాలని చెప్పాడు. ఒత్తిడికి గురవ్వకుండా.. పరుగులివ్వకుండా చేస్తే వికెట్లు వాటంతట అవే వస్తాయని చెప్పాడు. ధోనీ సర్ సారథ్యంలో ప్రతీ రోజు నేర్చుకుంటూనే ఉన్నాను.

ప్లాన్స్ అన్ని ధోనీ సర్‌కు చెబుతా..

ప్లాన్స్ అన్ని ధోనీ సర్‌కు చెబుతా..

మ్యాచ్‌కు ముందు ధోనీ సర్ దగ్గరకు వెళ్లి నా బౌలింగ్ ప్లాన్స్ చెబుతాను. అది అతనికి నచ్చితే ఒకే అంటారు. లేకపోతే నా ప్రణాళికలోని తప్పిదాలను సరి చేస్తాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత నా ప్రదర్శనపై ధోనీ సర్ నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటాను. ఇలాంటి విషయాలను ఆయన సంతోషంగా చెబుతారు. ధోనీ సర్ ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. ఒత్తిడికి గురికావద్దని. ఒత్తిడి వల్ల అనేక తప్పిదాలు చేస్తారంటాడు. ప్రశాంతంగా ఉంటూ బౌలింగ్ చేయాలని సూచిస్తాడు.

 కొత్తగా ఉంది..

కొత్తగా ఉంది..

ఐపీఎల్ అనుభవం చాలా బాగుంది. మేనేజ్‌మెంట్, సీనియర్స్, టీమ్‌మేట్స్ ఎంతో మద్దతు ఇస్తున్నారు. ధోనీ సర్ నా శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచాడు. ప్రతీ రోజు నన్ను గైడ్ చేస్తూనే ఉన్నాడు. ధోనీ సారథ్యంలో ఆడుతున్నందుకు గొప్పగా ఫీలవుతున్నా. ధోనీ నుంచి చాలా నేర్చుకుంటున్నా. జడేజా, బ్రావో, రుతురాజ్‌లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం గొప్ప అనుభూతిని ఇస్తోంది. ప్లే ఆఫ్స్ చేరడమే మా లక్ష్యం.'అని ముఖేశ్ చౌదరి చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, May 3, 2022, 18:49 [IST]
Other articles published on May 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+