Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రావోకు బదులు నేను బౌలింగ్ చేయడమే బెటర్ అనుకుంటా: ధోనీ

IPL 2022: MS Dhoni trolls Dwayne Bravo in viral video

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండు మాత్రమే గెలిచి ఆ జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది. వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. టోర్నీలో మిగిలిన 6 మ్యాచ్‌లు గెలిచినా చెన్నై ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. 6 మ్యాచ్‌లు గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంత క్లిష్ట పరిస్థితులున్నా.. ఆ జట్టు ఆటగాళ్లు చాలా రిలాక్స్‌గా ఉన్నారు.

నవ్వులు పూయించిన ధోనీ..

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీతో పాటు కీలక ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో, ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ముగ్గురూ కలిసి టీమ్ నిర్వహించిన ఓ సరదా కార్యక్రమంలో పాల్గొన్నారు. టోర్నీలోని పలు సందర్భాల్లో ఈ ఆటగాళ్లకు సంబంధించిన పలు ఫొటోలు తీయగా.. వాటికి సంబంధించిన ఎక్స్‌ప్రెషన్స్‌కు సరిపడే అర్థం వచ్చేలా తమదైన శైలిలో కామెంట్లు చేసారు. సహజంగా ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండే ధోనీ.. ఈ సారి మాత్రం నవ్వులు పూయించాడు. తమ సహచర ఆటగాళ్లపై జోకులు పేల్చాడు.

బ్రావో బుర్రపని చేయలేదని..

బ్రావో బుర్రపని చేయలేదని..

ఈ కార్యక్రమంలో తొలుత బ్రావో తన తల దగ్గర రెండు చేతులు పెట్టుకొని ధోనీతో కలిసున్న ఫొటోను చూపించగా.. ధోనీ ఇలా సమాధానాలిచ్చాడు. బ్రావో చాలా సార్లు బుర్ర పనిచేయడం లేదని తనతో చెప్పాడని జోక్‌ చేశాడు. అలాగే రుతురాజ్‌ క్రీజులో డైవింగ్‌ చేస్తున్న ఫొటోకు.. నీళ్లు లేనిచోట ఈతకొడుతున్నాడని సమాధానమిచ్చాడు. ఇక కెప్టెన్‌ జడేజాను రుతురాజ్‌ ఎగురుతూ హత్తుకొన్న ఫొటోను చూపించగా.. అది తమ మధ్య 'బ్రోమాన్స్‌' అని రుతురాజ్‌ వివరణ ఇచ్చాడు.

 బ్రావోపై ధోనీ సెటైర్లు

బ్రావోపై ధోనీ సెటైర్లు

ఈ క్రమంలోనే ధోనీ చిరాకుగా ఉన్న ఫొటో చూపించగా.. బ్రావో బౌలింగ్‌లో ఎవరైనా షాట్‌ ఆడితే.. వెంటనే తన గ్లోవ్స్‌ అతడికిచ్చి తాను బౌలింగ్‌ చేస్తే బాగుంటుందేమోనని, తన బౌలింగ్‌ ఇంతకన్నా చాలా మెరుగ్గా ఉంటుందని భావిస్తానని ధోనీ సరదాగా పేర్కొన్నాడు. వన్ నంబర్ చూపిస్తున్న తన ఫొటోపై స్పందిస్తూ.. ఒక్క వైడ్ కంటే ఎక్కువ వేయద్దని బ్రావోకు చెబుతున్నానని తెలిపాడు. మొత్తానికి ఈ వీడియోలో బ్రావోను ధోనీ ఓ ఆట ఆడుకున్నాడు.

Story first published: Thursday, April 28, 2022, 18:41 [IST]
Other articles published on Apr 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+