అందుకే విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ కెప్టెన్సీ వదులుకున్నాడు: మైక్ హెస్సెన్

బెంగళూరు: ఐపీఎల్ 2022 సీజన్‌లో కేవలం సీనియర్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగాలనే ఉద్దేశంతోనే విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలను వదులుకున్నాడని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) డైరెక్టర్ మైక్ హెస్సెన్ తెలిపాడు. ఓ సీనియర్ ప్లేయర్‌గా ఈ సమయాన్ని ఆస్వాదించాలని విరాట్ భావిస్తున్నాడని చెప్పాడు. ఐపీఎల్ 2021 సీజన్ ముగింపుతోనే విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ సారథ్యానికి గుడ్ చెప్పిన విషయం తెలిసిందే.
దాంతో ఆ జట్టు ఫాఫ్ డుప్లెసిస్‌ను తమ తదుపరి కెప్టెన్‌గా శనివారం బెంగళూరు వేదికగా నిర్వహించిన ఆర్‌సీబీ అన్‌బాక్స్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించింది. విరాట్ కోహ్లీ, దిగ్గజ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ సూచనల నేపథ్యంలోనే ఫాఫ్ డుప్లెసిస్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశామని ఈ సందర్భంగా మైక్ హెస్సెన్ తెలిపాడు. జట్టు కోసం కోహ్లీ ఎంతో చేశాడని కొనియాడాడు.

కోహ్లీ ప్రాణం పెట్టాడు..
'ఆర్‌సీబీ కోసం కెప్టెన్‌గా కోహ్లీ ఎంత కావాలో అంత కంటే ఎక్కువే చేశాడు. జట్టు కోసం తన ప్రాణం పెట్టి ఆడాడు. అయితే తన కెప్టెన్ రోల్ బాధ్యతల నుంచి తప్పుకొని కాస్త విరామం కావాలని కోహ్లీ కోరుకున్నాడు. ఇదే విషయాన్ని మాతో చెప్పాడు. ఇక నుంచి ఆర్‌సీబీలో సీనియర్ ఆటగాడిగా.. బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతానని.. ఆ సమయాన్ని తాను ఆస్వాదించాలనుకుంటున్నట్లు మాకు తెలిపాడు. అతని నిర్ణయాన్ని మేం గౌరవించాం. ఈ క్రమంలోనే నూతన సారథి గురించి అతనితో చర్చించాం.

విరాట్, ఏబీడీ సూచనలతోనే..
కొత్త కెప్టెన్ ఎవరైతే బాగుంటుందనే విషయంలో సీనియర్ ప్లేయర్‌గా అతని అభిప్రాయాన్ని తీసుకున్నాం. డుప్లెసిస్‌ను సారథిగా ఎంపిక చేయమని అతను సూచించాడు. సౌతాఫ్రికా లెజండ్‌ను ఆర్‌సీబీ నూతన కెప్టెన్‌గా ఎంపిక చేయడం పట్ల విరాట్ ఉత్సాహంగా ఉన్నాడు. ఏబీ డివిలియర్స్ సైతం ఫాఫ్ డుప్లెసిస్ పేరునే సూచించాడు. ఇక ఆర్‌సీబీలో విరాట్ కోహ్లీ ఓ మార్క్ సెట్ చేశాడు. దానిని రీచ్ కావడం ఎవరి తరం కాదు. ఇప్పటికీ వరల్డ్ టాప్-5 బ్యాట్స్‌మన్‌లలో విరాట్ కోహ్లీ ఒక్కడు. కెప్టెన్సీ ఒత్తిడి లేని నేపథ్యంలో అతను అప్‌కమింగ్ సీజన్‌లో మరింత స్వేచ్చగా ఆడే అవకాశం ఉంది.'అని మైక్ హెస్సెన్ చెప్పుకొచ్చాడు.

ఫాఫ్.. సూపర్ షో..
సౌతాఫ్రికా వెటరన్ బ్యాట్స్‌మన్ ఫాఫ్ డుప్లెసిస్.. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచ్‌ల్లో 633 పరుగులతో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే మెగా ఆక్షన్‌కు ముందు రిటెన్షన్ నిబంధనల నేపథ్యంలో చెన్నై అతన్ని వేలంలోకి వదిలేయగా.. ఆర్‌సీబీ రూ.7కోట్లకు కొనుగోలు చేసింది. ముంబై వేదికగా మార్చి 27న పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఆర్‌సీబీ తమ ఐపీఎల్ 2022 సీజన్‌ను ప్రారంభించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications