
ముంబైలోకి ఫాబియన్ అలెన్..
ఆర్‌సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో బరిలోకి దిగిన ముంబై.. ఈ సారి ముగ్గురితో ఆడే చాన్సుంది. లోయరార్డర్‌ను పటిష్టం చేసేందుకు విండీస్ బ్యాటర్ ఫాబియన్ అలెన్‌ను జట్టులోకి తీసుకురానుంది. గత మ్యాచ్‌లో అవకాశం ఇచ్చిన యువ ప్లేయర్ రమణ్‌దీప్ సింగ్‌ను పక్కనపెట్టి అతని స్థానంలో ఫాబియన్ అలెన్‌ను ఆడించనుంది. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ రానుండగా.. ఆ తర్వాత బేబీ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్ బరిలోకి దిగనున్నాడు. అతను గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు.
బేబీ ఏబీని పక్కనపెట్టాలని భావిస్తే టీమ్ డేవిడ్ ఆడనున్నాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్ బ్యాటింగ్ చేయనున్నారు. స్పిన్నర్ మురుగన్ అశ్విన్‌తో పాటు బసిల్ థంపి, జయదేవ్ ఉనాద్కత్‌లతో జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. టైమిల్ మిల్స్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం బసిల్ థంపి, ఉనాద్కత్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితం కానున్నారు.

ఒడియన్ స్మిత్‌పై వేటు..
ఇక పంజాబ్ కింగ్స్ తమ పేస్ ఆల్‌రౌండర్ ఒడియన్ స్మిత్‌పై వేటు వేసే అవకాశం ఉంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో స్మిత్.. చివరి ఓవర్‌లో 18 పరుగులు డిఫెండ్ చేయలేకపోయాడు. అంతేకాకుండా ఆఖరి రెండు బంతులకు రెండు సిక్స్‌లు ఇచ్చి ఓటమిపాలయ్యాడు. ఈ క్రమంలోనే అతనిపై వేటు వేయవచ్చు.
అయితే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మాత్రం స్మిత్ అండగా ఉంటామని చెప్పాడు. అలా భావిస్తే మాత్రం అతను జట్టులో ఉండే చాన్సుంది. స్మిత్‌కు బదులు భానుక రాజపక్సను తీసుకొని రిషి ధావన్‌ను ఆడించే చాన్సుంది. అప్పుడు జితేశ్ శర్మ ఉద్వాసనకు గురవుతాడు. ఓపెనర్లు మయాంక్, శిఖర్ థావన్ ఆడనుండగా.. లివింగ్ స్టోన్, బెయిర్ స్టో, రాజపక్స, షారూఖ్ ఖాన్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. రబడా, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్షదీప్ సింగ్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు.

పిచ్ రిపోర్ట్..
పుణే పిచ్ ఆరంభంలో పేసర్లకు అనుకూలిస్తుంది. ఇక్కడ డ్యూ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. పిచ్‌పై గ్రాస్ ఉండటంతో పేస్‌తో పాటు అనూహ్య బౌన్స్ ఉంటుంది. స్పిన్నర్లకు కూడా కలిసొస్తుంది. టాస్ గెలిచిన జట్టు ముందు బ్యాటింగ్ చేసినా వచ్చే నష్టం లేదు.

తుది జట్లు(అంచనా)
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), డెవాల్డ్ బ్రెవిస్/టిమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనాద్కత్, బసిల్ థంపీ/టైమిల్ మిల్స్
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, లివింగ్ స్టోన్, బెయిర్ స్టో, భానుక రాజపక్స, షారూఖ్ ఖాన్, రిషి ధావన్, కగిసో రబడా, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్షదీప్ సింగ్


Click it and Unblock the Notifications
