
ముంబైలోకి ఫాబియన్ అలెన్..
పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ముఖ్యంగా రెండు రనౌట్లు ఆ జట్టు పతనాన్ని శాసించాయి. యువ ఆటగాళ్లు సత్తా చాటినా చివర్లో తడబడటంతో ఓటమి తప్పలేదు. ఈ క్రమంలోనే లోయరార్డర్‌ను పటిష్టం చేసేందుకు విండీస్ బ్యాటర్ ఫాబియన్ అలెన్‌ను జట్టులోకి తీసుకురానుంది. టైమిల్ మిల్స్ స్థానంలో ఫాబియన్‌కు అవకాశం ఇవ్వచ్చు. లేదంటే టీమ్ డేవిడ్‌ను ఆడించవచ్చు. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ బరిలోకి దిగనుండగా.. ఆ తర్వాత బేబీ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ చేయనున్నాడు. అతను గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు.
ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్ బ్యాటింగ్ చేయనున్నారు. స్పిన్నర్ మురుగన్ అశ్విన్‌తో పాటు బసిల్ థంపి, జయదేవ్ ఉనాద్కత్‌లతో జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. మార్కండేయను తీసుకోవాలనుకుంటే మాత్రం బసిల్ థంపి, మురుగన్ అశ్విన్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితం కానున్నారు.

మార్పుల్లేకుండా లక్నో..
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో ఓటమి చూసిన లక్నో... ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. కానీ జట్టు నిండా ఆల్‌రౌండర్లే ఉండటంతో మార్కస్ స్టోయినిస్ ఎక్కడ ఆడించలనేది తేల్చుకోలేకపోయింది. గత మ్యాచ్‌లో లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేసిన అతను విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు.
కానీ కుల్దీప్ సేన్ సూపర్ బౌలింగ్‌తో ఆ పని పూర్తి చేయలేకపోయాడు. ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ ఆడనుండగా.. మార్కస్ స్టోయినీస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, కృష్ణప్పగౌతమ్ 9వ స్థానం వరకు వరుసగా బ్యాటింగ్ చేయనున్నారు. దుష్మంత్ చమీరాతో పాటు రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు.

పిచ్ రిపోర్ట్
బ్రాబౌర్న్ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం. గత రెండు మ్యాచ్‌లో ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. అంతేకాకుండా వికెట్లు చేతిలో ఉంటే ఎంతటి భారీ లక్ష్యమైనా చేదించవచ్చు. మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో డ్యూ ప్రభావం ఉండదు. కానీ టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.

తుది జట్లు (అంచనా)
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనాద్కత్, మురుగన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, బసిల్ థంపీ
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్(కీపర్), మార్కస్ స్టోయినీస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, దుష్మంత్ చమీరా, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్


Click it and Unblock the Notifications
