Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ సక్సెస్ మంత్రా ఇదే! ఒక్క ప్లేయర్‌కు రూ.10 కోట్లు పెట్టలే!

IPL 2022: MI And CSK Franchise Never Spent More Than 10 Crore In IPL Auctions Is There Success Mantra

హైదరాబాద్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) అత్యంత విజయవంతమైన జట్లు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్(2013, 2015, 2017, 2019, 2020) ఐదు సార్లు టైటిల్ గెలవగా.. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచింది. చెన్నై 2010, 2011, 2018, 2021 సీజన్లలో టైటిల్ కొట్టింది. అయితే ఈ రెండు జట్ల సక్సెస్‌కు ప్రధాన కారణం బలమైన టీమ్ ఉండటమే అనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

వేలంలో ఈ రెండు జట్లు అనుసరించే వ్యూహాలు, ప్రణాళికలకు తగ్గట్లు ఎంచుకున్న ఆటగాళ్లను జట్టుకు అనుకూలంగా మార్చుకోవడం వీరికి కలిసొచ్చింది. అయితే షాకింగ్ విషయం ఏంటంటే.. గత 14 సీజన్లుగా జరిగిన వేలంలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్క ప్లేయర్‌ కోసం రూ. 10 కోట్లు చెల్లించింది లేదు. ముంబై ఇండియన్స్ అనామక ఆటగాళ్లు, యువ ప్లేయర్లను తీసుకుంటే.. చెన్నై సూపర్ కింగ్స్ ఎస్టాబ్లిష్‌డ్ ప్లేయర్స్(సీనియర్ ఆటగాళ్ల) ఎంచుకొని సక్సెస్ సాధించింది.

మెగా వేలంలో వారు అనుసరించిన వ్యూహాలు, ఎంచుకున్న ఆటగాళ్లతోనే ఈ రెండు జట్లు సగం విజయం సాధించాయి. కానీ ఇతర ఫ్రాంచైజీలు మాత్రం ముందు వెనుకా ఆలోచించకుండా స్టార్ ప్లేయర్ల కోసం కోట్లు కుమ్మరించి మూల్యం చెల్లించుకున్నాయి. లీగ్‌లో అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. దానికి ప్రధాన కారణం సరైన ఆటగాళ్లను ఎంచుకోకపోవడం. కోట్లు కుమ్మరించి కోనుగోలు చేసిన ప్లేయర్లు చేతులెత్తయడం. ఇక ప్రతీసారి ఆ జట్టుకు బ్యాటింగ్ బలంగా ఉంటే బౌలింగ్ బలహీనంగా ఉంటుంది. ఈ సమస్యతోనే ఆ జట్టు 2016లో తృటిలో టైటిల్ చేజార్చుకుంది.

గత సీజన్‌లో కైల్ జెమీసన్‌కు రూ. 15 కోట్లకు తీసుకొని మూల్యం చెల్లించుకుంది. వేలంలో చెన్నై.. ప్రతీసారి ప్రత్యర్థి జట్లను తప్పుదోవ పట్టిస్తోంది. జెమీసన్ కోసం గత వేలంలో రూ. 14 కోట్ల వరకు బిడ్ చేసిన ఆ జట్టు.. ఆర్‌సీబీ రూ. 15 కోట్లకు తీసుకునేలా చేసి దెబ్బతీసింది. ఈ సారైన ఇతర ఫ్రాంచైజీలు చెన్నై, ముంబై మాదిరి తెలివిగా ఆలోచించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Story first published: Tuesday, February 8, 2022, 12:56 [IST]
Other articles published on Feb 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+