చెన్నై, ముంబైని ఉద్దేశించి..
సన్‌రైజర్స్ విజయం నేపథ్యంతో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలను ఉద్దేశిస్తూ సెటైర్లు పేల్చుతున్నారు. టాలీవుడ్ హిట్ మూవీ జాతి రత్నాలు సినిమాలో డైలాగ్‌తో చేసి ఓ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. రెండు విజయాలందుకున్న సన్‌రైజర్స్.. వరుసగా నాలుగు పరాజయాలు చవి చూసిన ముంబై, చెన్నైతో.. 'సీరియస్‌నెస్ రాదా రా? మీకు ఇంకా లైఫ్‌లో'అని ప్రశిస్తుందనే ఆ మీమ్ నవ్వులు పూయిస్తోంది.
కేన్ విలియమ్సన్ దండయాత్ర..
యంగ్ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన హిట్ మూవీ 'టెంపర్'లోని డైలాగ్స్‌ను కూడా సన్‌రైజర్స్ విజయానికి ఆపాదిస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 'ఇది దండయాత్ర.. కేన్ విలియమ్సన్ దండయాత్ర'అని టీమ్ పెర్ఫామెన్స్‌ను కొనియాడుతున్నారు. మరో మీమ్‌లో మేం ఓడిపోతామనుకున్నారు కదరా? అంటూ సెటైరికల్‌గా మీమ్ క్రియేట్ చేశారు. రంగస్థలంలోని రామ్ చరణ్.. ఇదయ్యా మీ అసలు రూపం అనే డైలాగ్‌ను కూడా వాడేసుకున్నారు.
ఎవ్వడు తిట్టొద్దు..
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ట్రోలింగ్స్ ఆపి సపోర్ట్ చేయాలని అభిమానులు పిలుపునిస్తున్నారు. జట్టు సమష్టిగా రాణిస్తూ విజయాలను అందుకుంటుందని, ఒక్కో ఆటగాడు మ్యాచ్ మ్యాచ్‌కు మెరుగవుతున్నాడని కామెంట్ చేస్తున్నారు. గుజరాత్‌తో ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఎవరూ తిట్టవద్దని ఆదేశిస్తున్నారు. పటిష్టమైన గుజరాత్‌నే సన్‌రైజర్స్ ఓడించిందని, వరుస విజయాలతో దూసుకెళ్లాలని కోరుకుందామని కామెంట్ చేస్తున్నారు.

సన్‌రైజర్స్ ఆల్‌రౌండ్ షో..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (42 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 50 నాటౌట్) అర్ధ సెంచరీ చేయగా, అభినవ్ మనోహర్ (21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించాడు. అనంతరం హైదరాబాద్ 19.1 ఓవర్లలో 2 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ విలియమ్సన్ (46 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు 57) హాఫ్ సెంచరీ సాధించగా, అభిషేక్ శర్మ (32 బంతుల్లో 6 ఫోర్లతో 42), పూరన్ (18 బంతు ల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్) మెరిశారు.


Click it and Unblock the Notifications












